English | Telugu

మేమెప్పటికీ విడిపోము...ఆ రెండు కుర్చీలు ఖాళీ కావడం నిజంగా బాధాకరం  

సిక్స్త్ సెన్స్ సీజన్ 5  లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వచ్చారు. వీళ్ళ ఇద్దరి రియల్ స్టోరీనే సినిమాగా "మళ్ళీ పెళ్లి" పేరుతో త్వరలో  రాబోతోంది. "మీరు ముద్దుగా పవిత్ర లోకేష్ గారిని ఏమని పిలుస్తారు" అని ఓంకార్ అడిగేసరికి "అమ్ములు అని పిలుస్తాను ఇంకా ముద్దొస్తే అమ్ము అంటాను... ఇంకా ముద్దొస్తే..వద్దులే " అని తప్పించుకున్నాడు నరేష్. వీళ్ళతో పాటు ఈ స్టేజి మీద ఆడియన్స్ ని అలరించడానికి "డెడ్ పిక్సల్స్ మూవీ టీమ్ నుంచి నిహారిక కొణిదెల, అక్షయ్, సాయి రోనాక్ వచ్చారు, ఇంకా   సేవ్ ది టైగర్స్ మూవీ నుంచి అభినవ్, పావని గంగిరెడ్డి  వచ్చారు. కాసేపు సాంగ్స్ , డాన్సేస్ తో ఎంటర్టైన్ చేశారు...  కృష్ణ చేసి "జుంబారే " సాంగ్ కి ఆయన్ని ఇమిటేట్ చేస్తూ నరేష్ డాన్స్ చేసాడు.

గెలిచిన లక్షని తన యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ కే అన్న రష్మీ...

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం భలే హుషారుగా సాగింది. ఇందులో రష్మీని కొన్ని ప్రశ్నలు వేసాడు ఓంకార్. "ఒక ఐలాండ్ లో ఉండిపోతే నీకు కంపెనీ ఎవరు ఉంటే బాగుంటుంది" అనుకుంటారు అనేసరికి "సుధీర్ ఉంటే బాగుండు" అని అనుకుంటాను అని చెప్పింది. తర్వాత "మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగేసరికి నేను బ్రహ్మాజీ గారు బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్" అని చెప్పింది..."మీ బాయ్ ఫ్రెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి .." అంటే ఏం చెప్తారు అని ఓంకార్ అడగడంతో  "మనిషి కన్ఫ్యూషన్ లో ఉండకూడదు..ఏది అనుకుంటాడో అదే చెప్పాలి..అదే చేయాలి... అదే ముఖ్యమైన క్వాలిటీ ..." అని చెప్పింది. " మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చేయాలి" అని అడిగేసరికి " ఒక స్ట్రీట్ యానిమల్ ని అడాప్ట్ చేసుకోవాలి. నా గుడ్ బుక్స్ లో రావాలి అంటే అదే చాలా తేలికైన దారి. వైజాగ్ లోని దువ్వాడలో ఒక యానిమల్ షెల్టర్ కట్టాను. అది పూర్తిగా కాలేదు ఇంకా.

త్వరలో ‘పలుకే బంగారమాయెనా’ కొత్త సీరియల్!

ఇప్పటివరకు స్టార్ మాలో రకరకాల వైకల్యాలు ఉన్న క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ళ మనోబలాన్ని హైలైట్ చేసి చూపిస్తూ తీసిన ఎన్నో సీరియల్స్ హిట్ లిస్ట్ లో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని చూస్తే నల్లగా ఉన్న అమ్మాయికి సంబంధించి కార్తీక దీపం, మూగ అమ్మాయికి సంబంధించిన సీరియల్ మౌనరాగం, కంటి చూపు లేని అబ్బాయికి సంబంధించిన సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా వైకల్యం ప్లస్ సెంటిమెంట్ కలిపి ప్రసారం చేసిన ఎన్నో సీరియల్స్ ఆడియన్స్ మనసుల్ని దోచుకున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో కోణం ఉన్న సీరియల్ త్వరలో రాబోతోంది.

తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి మీద రచ్చ చేయబోతున్న దేవిశ్రీ

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి డిఎస్పి వచ్చాడు. దేవి శ్రీప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ మస్త మజా డాన్సులు, పాటలు ఉంటూనే ఉంటాయి. అలాంటి డిఎస్పి ఇండియన్ ఐడల్ స్టేజి మీదకు వచ్చాడంటే రచ్చ రచ్చ కాకుండా ఎలా ఉంటుంది. ఇక స్టేజి మీదకు కార్తిక్, థమన్, దేవి వచ్చారు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. "తెలుగు ఇండియన్ ఐడల్ కి మోస్ట్ స్పెషల్ ఎక్సక్లూసివ్ మూమెంట్ ఏమిటి అంటే థమన్, డిఎస్పీ ఈ స్టేజి మీదకు రావడమే..డిఎస్పీ మచ్చా థాంక్యూ సో మచ్" అని చెప్పాడు కార్తిక్. "దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ లో నీకు ఇష్టమైన సాంగ్ ఏమిటి " అని కార్తిక్  థమన్ ని అడిగాడు.

రిషి వసుధారలకు అన్నీ మంచి శకునాలే..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -763 లో... జగతి డల్ గా ఉండడంతో మహేంద్ర వచ్చి ఎందుకు ఇలా డల్ గా ఉన్నావ్.. రిషి, వసు ఒక్కటి అవ్వాలని నువ్వే వాళ్ళ కంటే ఎక్కువగా ఆరాటపడ్డావ్.. ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటని అంటాడు. అప్పుడే జగతి, మహేంద్రల దగ్గరికి శైలేంద్ర, దేవయానిలు వస్తారు. ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఎందుకు జగతి అలా డల్ గా ఉంటున్నావని దేవయాని అంటుంది. ఎందుకు ఎంగేజ్ మెంట్ ఇష్టం లేనట్లు ఉంటున్నావ్.. నువ్వు వసుధారకి ఏదో చెప్పినట్లు ఉన్నావ్.. అందుకే ఎంగేజ్ మెంట్ వద్దంటుంది. శైలేంద్ర రావడం నీకు ఇష్టం లేనట్లు ఉందని దేవయాని అంటుంది. అదేం లేదు మీరు వెళ్ళండి జగతితో నేను మాట్లాడి వస్తానని మహేంద్ర అంటాడు.

ఒక సమయంలో నన్ను తిట్టారు...నా పని ఐపోయింది అని వెక్కిరించారు

"దసరా" మూవీలో వెన్నెల చేసే తీన్ మార్ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈటీవీలో మదర్స్ డే సందర్భంగా "ప్రియమైన నీకు" షోలో ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన జిత్తు మాస్టర్ వర్షతో కలిసి డాన్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. ఈ సాంగ్ ఒక్కో స్టెప్ కి ఒక్కో అర్ధం ఉందని కూడా వాటి గురించి వివరించి చెప్పాడు. " కొరియోగ్రాఫర్ కాకముందు మీ జర్నీ, స్ట్రగుల్స్ గురించి చెప్పండి" అని విష్ణుప్రియ అడిగింది. "మాష్టర్ ఐపోయిన వెంటనే అవకాశాలు రావు.. నేను ఎప్పటికైనా కొరియోగ్రాఫర్ ని అవుతాను అనే నమ్మకం నాకు ఉండేది. ఛాన్సెస్ కోసం చాలాచోట్లకు తిరిగాను. వస్తాయి అనుకున్న ఛాన్సులు ఏడేళ్ల వరకు రాలేదు.

మావారు మాస్టారు.. అతి త్వరలో!

జీ తెలుగులో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ ఎంత పాపులరో అందరికి తెలిసిన విషయమే.. 'మావారు మాస్టారు' అనే సరికొత్త ధారావాహిక త్వరలో వస్తున్నట్లుగా మేకర్స్ ప్రోమో ని రిలీజ్ చేసారు. అతి త్వరలో ప్రసారం కాబోతున్న ఈ 'మావారు మాస్టారు' సీరియల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వారు పసుపు కుంకుమ, ముద్ద మందారం, పున్నాగ, గీతాంజలి లాంటి గొప్ప సీరియల్స్ ని నిర్మించారు. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ గా సంగీత కళ్యాణ్, హీరోగా పృథ్వీరాజ్ నటిస్తున్నారు.‌ మొగలి రేకులు సీరియల్ ఫేమ్ సెల్వరాజ్ ఇందులో హీరోయిన్ కి నాన్నగా చేస్తున్నాడు. ముద్దమందారం ఫేమ్ భవానిరెడ్డి ఇందులో ముఖ్యపాత్రని పోషిస్తుంది.

ఏ మూవీ ఐనా బుల్లితెర మీద ప్రమోట్ చేసుకోవాలి..నాకు స్మాల్ స్క్రీన్ అంటేనే ఇష్టం

శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంత మందిని ఈ వారం రష్మీ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఎపిసోడ్ ఫైనల్ లో మాత్రం ఇంద్రజ రష్మీని ఎన్కౌంటర్ చేసింది. "రష్మీ మీరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయారు...స్మాల్ స్క్రీన్ మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఐనా బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయాను అనే బాధ మీకు ఉందా" అని ఇంద్రజ రష్మీని అడిగింది. ఈ ప్రశ్నకు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి అని చెప్పింది ఇంద్రజ. "నేను బిగ్ స్క్రీన్ మీద ఏం ఎక్స్పీరియన్స్ చేసాను అంటే చెప్పేది ప్రతీ సారి జరగదు. ఇందాక మహేష్ గారు చెప్పినట్టు రాత్రికి రాత్రి క్యారెక్టర్స్ మారిపోతాయి. మీరు సెకండ్ హీరోయిన్ అని చెప్తారు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్ కాస్త ఫ్రెండ్ రోల్ కి మారిపోతుంది. జనాల ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఫ్రెండ్ రోల్ అంటే స్టాంప్, మదర్ రోల్ అంటే స్టాంప్ ఇప్పుడు ప్రతీ ఒక్క రోల్ ని క్యారెక్టర్ కింద చూస్తున్నారు.