English | Telugu

బర్త్ డే మర్చిపోతే ఇంకేమన్నా ఉందా!

అలా మొదలయ్యింది షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించడానికి వచ్చేసింది. చందు మొండేటి-సుజాత జోడీగా వచ్చిన ఈ రాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "ఎలా అనిపిస్తోంది" అని హోస్ట్ కిషోర్ అడిగేసరికి "కొంచెం టెన్షన్ ఉంది..ఏం చెప్పేస్తానో అని" అన్నాడు చందు. "గతంలో మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంది అప్పుడు కలర్ లో ఈ అమ్మాయి కనిపించేసరికి ఆ అని చెప్పి అక్కడే కూర్చుండిపోయాను" అని చెప్పాడు చందు. "చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ" అనుకుంటా అనేసరికి "తనకు ఇమ్మెచ్యూర్డ్ ఏమో, నాకు మెచ్యూర్డ్ " అని నవ్వుతూ చెప్పారు సుజాత. "మేము ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటే వినె చుట్టుపక్కన వాళ్ళు వీళ్ళు మరో ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటారేమో అనుకునేలా మాట్లాడుకునేవాళ్ళం.

" మ్యారేజ్ అయ్యాకే ఇన్ని బర్త్ డేస్ అయ్యాయి కదా..బర్త్ డే మర్చిపోతే ఇంకేమన్నా ఉందా" అని తన బాధను చెప్పుకున్నాడు. "మేడం అలక అసలు ఎలా ఉంటుంది" అని అడిగేసరికి "మూవీ రిలీజ్ రోజు ఒక టెన్షన్ ఉంటుంది కదా ఆమె అలిగినప్పుడు కూడా నాకు అలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది" అని చెప్పాడు చందు మొండేటి. "హడావిడి కేంద్రం" అని వాళ్ళ అమ్మ వాళ్ళు చందుకి పేరు పెట్టారని చెప్పారు సుజాత. ఇక ఆ పేరు పిలిచి కాసేపు ఫన్ చేసాడు కిషోర్. మన పురాణాలు, సైన్స్ లాంటి అంశాల మీద మంచి పట్టున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఆయన కార్తికేయ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తర్వాత కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ ని అందించాడు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై కార్తికేయ 3 రూపొందబోతుందని టాక్ వినిపిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.