English | Telugu

త్వరలో ‘పలుకే బంగారమాయెనా’ కొత్త సీరియల్!

ఇప్పటివరకు స్టార్ మాలో రకరకాల వైకల్యాలు ఉన్న క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ళ మనోబలాన్ని హైలైట్ చేసి చూపిస్తూ తీసిన ఎన్నో సీరియల్స్ హిట్ లిస్ట్ లో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని చూస్తే నల్లగా ఉన్న అమ్మాయికి సంబంధించి కార్తీక దీపం, మూగ అమ్మాయికి సంబంధించిన సీరియల్ మౌనరాగం, కంటి చూపు లేని అబ్బాయికి సంబంధించిన సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా వైకల్యం ప్లస్ సెంటిమెంట్ కలిపి ప్రసారం చేసిన ఎన్నో సీరియల్స్ ఆడియన్స్ మనసుల్ని దోచుకున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో కోణం ఉన్న సీరియల్ త్వరలో రాబోతోంది.


నాన్న ప్రేమను దూరం చేసిన లోపం నత్తి అనే కాన్సెప్ట్ "పలుకే బంగారమాయెనా" అనే కొత్త సీరియల్ త్వరలో రాబోతోంది. ఇందులో మెయిన్ లీడ్ రోల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి నటిస్తోంది. ఈ చిన్నారి ఇప్పటివరకు 10 మూవీస్ లో, 15 టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసి తన సత్తా చూపించింది. ఈటీవీలో ప్రసారమవుతున్న "యమలీల" అనే సీరియల్ లో శ్రీదేవి పాత్రకు చాల బాగుంటుంది. అలాగే శ్రీదేవి ఇటీవల వచ్చిన రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ , సూపర్ మచ్చి, కళ్యాణ్ రామ్ తో బింబిసార సారా" మూవీస్ లో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించి అలరించింది.

అలాగే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నందగోపాల్ పాత్రలో కనిపించిన హరికృష్ణ ఈ సీరియల్ లో శ్రీదేవికి తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ కొత్త సీరియల్ లో శ్రీదేవి నత్తి అమ్మాయి క్యారెక్టర్ లో సంగీతం నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సంగీతం మాస్టారు మాత్రం మీ అయ్యాయికి సంగీతం నేర్పితే నత్తి పోతుంది అనే ఆలోచన బాగుంది కానీ ఆ నత్తి వల్లనే ఆమెకు సంగీతం రావడం లేదని, మీ ప్రయత్నం విరమించుకుంటే మంచిది అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఈ దరిద్రం గురించి ఊరంతా తెలియాలనా ఈ సంగీతం అనేది పెట్టావ్...ఏదీ దీని వల్ల కాదు దీని బతుకింతే..ఇంట్లో ఏడవమను అని కూతురు మీద సీరియస్ అయ్యే రోల్ లో నందు మంచి ఎక్స్ప్రెషన్స్ ని ఇచ్చాడు. ఇలా రాబోతున్న ఈ సీరియల్ ఏ టైం స్లాట్ లో ప్రసారం అవుతుంది అన్న విషయాన్ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఏ సీరియల్ ప్లేస్ లో ఈ సీరియల్ రాబోతోంది..ఏ సీరియల్ ఎండ్ కాబోతోంది అనే డీటెయిల్స్ కోసం కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.