English | Telugu

ఇన్ స్టాగ్రామ్ లో బ్లూ టిక్ వచ్చిందనే సంతోషంలో కరుణ భూషణ్!

కరుణ భూషణ్.. బుల్లితెర అభిమానులకు బాగా పరిచయమైన పేరు. మొగలి రేకులు సీరియల్ లో‌ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ భూషణ్.‌.‌ అభిషేకం సీరియల్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు జీ తెలుగులోని వైదేహీ సీరియల్ లో‌ నెగెటివ్ రోల్ చేస్తుంది కరుణ భూషన్.

తాజాగా కరుణ భూషణ్ వాళ్ళ‌ కొడుకుతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో తన‌ కొడుకు గురించి మాట్లాడుతూ.. నేను కొంచెం బాగా రెడీ అయిన 'యూ లుకింగ్ హాట్ మమ్మీ' అని అంటాడని చెప్పింది కరణ భూషణ్. ఎప్పుడు అయినా మంచి గుర్తింపు డ్రెస్ వేసుకుంటే.. బ్యూటిఫుల్ అని చెప్తాడంట.

మంచిగా రెడీ అయితే.. 'యూ ఆర్ లుకింగ్ సెక్సీ' అని నా కొడుకు చెప్తాడు.. పిల్లలు పేరెంట్స్ తో ఇలా ఉంటేనే నాకిష్టమని కరుణ భూషణ్ చెప్పుకొచ్చింది. అలా తను చెప్పడంతో పిల్లలకి నేర్పించేది ఇదేనా అని విమర్శలు కూడా వచ్చాయి. అయితే వాళ్ళ కొడుకు తేజతో కలిసి రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కరుణ భూషణ్.

తాజాగా శ్రీప్రియతో కలిసి రీల్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా దానికి విపరీతమైన స్పందన లభించింది. ఇలా తనకి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది కరుణ భూషణ్. అయితే ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. దాంతో బ్లూ టిక్ వచ్చింది. దాంతో తన అభిమానులు హే బ్లూ టిక్ వచ్చింది.. కంగ్రాట్స్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. దీంతో మీ అభిమానానికి థాంక్స్ అని చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో పోస్ట్ చేస్తుంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.