ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న కరీనా చాక్లెట్ బ్రౌనీ!
వంద మాటలు చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో చెబుతుందని అంటారు. లేటెస్ట్గా కరీనా కపూర్ రిలీజ్ చేసిన ఫొటోలు కూడా ఇలాంటి విషయాన్నే వ్యక్తం చేస్తున్నాయి. తనలోని బాస్ లేడీని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నమే చేశారు కరీనా ఈ ఫొటో షూట్లో. కాసింత గ్లామర్ పాళ్లు ఎక్కువగా కనిపించినా, చూడ్డానికి ట్రెండీగా అనిపిస్తున్నాయి ఫొటోలు. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయితే ఫర్వాలేదు. ఏకంగా కరీనా జూనియర్స్, మనకు బాగా పరిచయమైన తమన్నా, రకుల్ కూడా సో హాట్ అంటూ రియాక్ట్ అయ్యారు.