Facebook Twitter
భరించేవాడే భర్త

భరించేవాడే భర్త


 

‘ఏమే, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏమేం కొన్నావేం?’’
టీవీ చూస్తూ అడిగాడు ముకుందం.
‘‘మన పెద్దాడికి జత బట్టలు, చిన్నాడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి ఒక చీర...’’
జాబితా చెప్పింది వరలక్ష్మి.
‘‘నేను గుర్తుకు రాలేదన్నమాట’’ ఛానల్ మారుస్తూ నిష్ఠూరంగా అన్నాడు ముకుందం.
‘‘భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతా నండి? ఇదిగోండి 12 వేల బిల్లు’’ చేతిలో పెట్టింది వరలక్ష్మి.