వెతకబోయిన తీగ
వెతకబోయిన తీగ
‘‘మాస్టారూ.. మాస్టారూ...’’
‘‘ఏంట్రా అబ్బాయ్’’
‘‘మీరు మొన్న ఒక సామెతకి తప్పు అర్థం చెప్పారు సార్..’’
‘‘నేను తప్పు అర్థం చెప్పానంటావా? చంపేస్తా వెధవా...’’
‘‘అవును సార్.. నిజంగానే తప్పు అర్థం చెప్పారు.. ‘వెతకబోయిన తీగ కాలికి తగిలింది’ అంటే అర్థం మనం కోరుకుంటున్నదే లభించినట్టు అని మీరు మొన్న చెప్పారుగా..’’
‘‘అవును’’
‘‘కానీ, మా పక్కింటాయన విషయంలో మాత్రం అందుకు రివర్స్‌లో జరిగింది. ఆయన కరెంటు తీగను వెతుకుతుంటే అది కాలికి తగిలింది.. అంతే, డైరెక్ట్‌గా పైకిపోయాడు’’
