Facebook Twitter
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే  గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు
ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడన వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు...

 ప్రియమైన ఉపాధ్యయులారా !


ఈ బాలలను మీ చేతులలోకి తీసుకుని వారికి అవసరమైనవన్నినేర్పండి,  సున్నితంగా వారి మనసుకి అర్థమయ్యేలా నేర్పించండి.
ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ధ నాయకుడు కూడా ఉంటాడని వారికి భోదించండి.
ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వారి'కి తెలియపరచండి.ఈర్ష్యకు వారిని దూరం చెయ్యండి.
మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వారికి నేర్పండి.
ఎదుటివారి మీద ఆధారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి.
మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి.
సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వారు తెలుసుకునేలా చేయండి.
అయితే అదే సమయంలో "
ఆకాశంలోని  పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో,
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వారికి ఇవ్వండి.
ప్రకృతిని వారు ఆరాదించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.
మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి.
ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి.సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు
లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి.
వారి'కి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి.

                 

మరొక్కసారి మీ అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...