Facebook Twitter
డా!! రావూరి భరద్వాజ

డా. రావూరి భరద్వాజ

సాహితీ ప్రపంచంలో నాటి తరం నేటి తరం అనే తేడా లేకుండా " పాకుడు రాళ్ళు " మీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే...మొట్టమొదటిసారిగా సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభావంతంగా బొమ్మకట్టించిన తొలి తెలుగు నవల అని నిక్కచ్చిగా చెబుతారు. అల చెప్పేలా గుర్తుంచుకోవడం మన గొప్పతనం కాదు.

మనలో మరిచిపోలేని మధురమైన భావంతో కలకాలం గుర్తుండిపోయేలా పాత్రలు సృష్టించి ఆ పాత్రలకు సరిపడా మాటలు రాసి గుండెను హత్తుకునేలా పాకుడు రాళ్ళను నడిపించిన డా !! రావూరి భరద్వాజ గారి కలానికి ఉన్న గొప్పతనం. 25 సంవత్సరాల క్రితం జ్ఞాన పీఠ్ అవార్డు- డాక్టర్ సి . నారాయణ రెడ్డి గారికి ''1988 '' లో విశ్వంభర కు వచ్చింది . ఇప్పుడు మళ్లీ 25 సంవత్సరాల తర్వాత డాక్టర్ రావూరి భరద్వాజ ''పాకుడు రాళ్ళు '' అనే రచనకు రావడం తెలుగు వారికి వెలుగు వేడుక. సాహితీ మూర్తులకు సంబరాల కానుక. వారికి తెలుగువన్.కామ్/సాహిత్యం అభినందనలు తెలుపుతుంది.