Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆనీ జైదీ

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆనీ జైదీ

ఆనీ జైదీ తల్లి యాస్మిన్ జైదీ కూడా కవయిత్రె. పేపర్స్కి కవితలు రాసేది. తాతగారు , పద్మశ్రీ పురస్కార గ్రహీత అలీ జవాద్ జైదీ ఉర్దూ కవీ, స్కాలర్. అలా సాహిత్యం, కవిత్వం ఆనీ జైదీ రక్తంలోనే ఉంది. ఆమె మొదటి వ్యాస సంకలనం Known Turf: Bantering with Bandits and other True Tales, 2010 Vodafone Crossword Book Award కి నోమినేట్ అయ్యింది. ఆమె ఒక జర్నలిస్ట్ కూడా. బందిపోట్లతో ధైర్యంగా చేసిన ఇంటర్వ్యూల్లో జరిగిన సంభాషణలూ, వారి నిజ జీవిత కధలే ఈ Bantering with Bandits అనే బుక్. చాలా పేరు తెచ్చిన రచన ఇది. ఆమె కవిత్వం The Crush (2007), కధలు The Good Indian Girl (2011) రాసింది. నవల, నాటకాలూ, అన్ని రకాల రచనా ప్రక్రియల్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది.

ఒక సమాజం నాగరిక సమాజమా కాదా అన్నది చెప్పాలంటే, ఆ సమాజం స్త్రీలను ఎలా చూస్తుంది అన్నదొకటే కొలమానం అంటుంది ఆమె. వారి వారి వృత్తుల ద్వారా సమాజంపై ప్రభావం చూపగల మహిళలల్లో మొదటి ముప్పై మందిలో ఒకరిగా ఆమెను టైంస్ ఒఫ్ ఇండియా అభివర్ణించింది. . అలాగే First 20 under 40 in South Asia : list of Granta లో కూడా ఆమె ఉంది. ఆమె రాసిన నాటకాలు రంగస్థలం పైనా ప్రదర్శించారు ఇంకా రేడియొలోనూ ప్రసారం అవుతాయి.

ఆమె నాటకాలకూ ఎవార్డ్స్ వచ్చాయి. known Turn అనే బ్లొగ్ పేరుతో blogsరాస్తుంది. ఇందులో అన్నిప్రస్తుత రాజకీయ సామాజిక పరిణమాలపై, సంఘటనలపై ఆమె వ్యాఖ్యలూ విమర్శలూ మనం చదవచ్చు. వీలు చేసుకుని ఆమె బ్లాగ్స్ చూడండి చాలా బాగుంటాయి.

ఆమె Unbound: 2000 yeas of Indian Women's writing అనే పుస్తకం ఎడిట్ చేసింది. సుసీ తరు, కె లలిత రాసిన Women Writing in India : 600 BC to The Present అనె బుక్ మాదిరిగానే ఈ బుక్ లో కూడా స్త్రీలు మొదటి నుంచి అంటే ప్రపంచానికి తెలిసిన స్త్రీ రచనలనన్నిటినీ పొందు పరిచిన ఒక అద్భుత ప్రయత్నం. ఇందుకోసం రచయిత్రులుగా ఏం రాస్తే ఇందులో చేర్చచ్చు అన్న కొన్ని నిర్ణయాలు ఆమె తీస్కోవాల్సివచ్చింది. ఇక ఆ తరవాత ఒక నవలా రచయిత్రి గురించి రాయాలంటే ఆమె రచనని ఉటంకించాలంటే ఆ రచనలో ఏ భాగాన్ని అనేది చాలా క్లిష్టమైన పని. దీని కోసం వారి రచనలని కూలంకషంగా చదవటం అన్నది తప్పనిసరి. ఈ పని అనువాదాల ద్వారా చెయ్యాల్సివచ్చినప్పుడు ఇంకా క్లిష్టమవుతుంది. ఇది కూడా ఆమెకు ఎంతో పేరు తెచ్చిన పుస్తకం.

2012 డిసెంబరులో జరిగిన నిర్భయ రేపు కేసు దేశాన్నంతా షాక్కి గురిచేసింది. ఈ రేపు తర్వాత ముంబై ముంచిపల్ కార్పొరేషన్ అసలు ఈ రేప్స్ అన్నిటికీ షాప్స్ వాళ్ళు బొమ్మలకి వేసే లింగరీ వల్ల వస్తోందని తీర్మానించి లింగరీ వేసిన బొమ్మల్ని షాపులముందు ప్రదర్శనకి నిలబెట్టడాన్ని ban చేసారట. ఎందుకంటే అదే రేపులు చెయ్యటానికి మగవారిని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి. ఇదెలా ఉందంటే ఈమధ్య ఓ పీఠాధిపతి శని గుడిలోకి స్త్రీలు వెళితే వారందరూ మానభంగాలకు గురవుతారని హెచ్చరించి భయపెట్టే ప్రయత్నం చేసాడు చూసారా అలా ఉంది. ఈ ఉదంతానికి స్పందిస్తూ ఆమె భూత్నామా అనే షార్ట్ ఫిల్మ్ తీసింది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పక చూడండి. ఆమె కవిత్వం, కధలూ వ్యాసాలూ, నాటకాలూ, వ్యాఖ్యలే కాకుండా సంఘటనలమీద స్పందించేందుకు ఇంకో మాధ్యమాన్ని కూడా ఉపయోగిస్తుంది. సింపుల్ గా సూటిగా, గ్రాఫిక్ స్టోరీస్ రూపంలో. అలాంటి ఒక గ్రాఫిక్ స్టోరీలో ఇద్దరు స్త్రీలు ట్రైన్లో ప్రయాణిస్తూ టిక్కట్టు లేకుండా రైల్లో తలుపు పక్కన కూర్చుని ప్రయాణించే బీదవారిని ఉద్దేశించి, అసల ఇలాంటి వారి వల్లే రైల్వేస్ కి నష్టాలు వస్తున్నాయని మాట్లడుకుంటారు. అక్కడ ఇంకొందరు ప్రయణీకులు ఫ్రీగా పోర్న్ ఎలా డౌన్ లోడ్ చెయ్యాలని నేర్చుకుంటుంటారు. మాటల్లో ఈ ఇద్దరు స్త్రీలు తాము అమ్మిన కొన్న ఫ్లాట్స్ లో వైటు ఎంత వచ్చింది బ్లాక్ ఎంత వచ్చింది అని కూడా మాట్లాడుకుంటారు. మనకు మనం చేసేవి తప్ప అందరు చేసేవీ తప్పుగా అనిపించడం చాలా సహజం. నిజానికి బక్క రైతుల రుణాలకన్న బలిసిన బీరు బిస్నెస్ స్వాములు ఎలా బేంకుల ద్వారా ప్రజల సొమ్ము తిని తప్పించుకుంటారో మనం చూస్తున్నదే.

 

- Sharada Sivapurapu