Facebook Twitter
ప్రతిభకు పట్టాభిషేకం...

ఆశాజీవికి ఈ ప్రపంచం 

...ఒక సుందర నందనవనం

 

శ్రమజీవికి ఈ ప్రపంచం

...ఒక పోరాటం ఒక ఆరాటం

 

నిరాశజీవికి ఈ ప్రపంచం 

...మోడువారిన ఒక వృక్షం

...పండి ఎండిన పొలం

...చుక్కలు లేని ఆకాశం

...అలల అలజడికి

...అల్లకల్లోలమైన ఓ కడలి

 

అందుకే ఓ మనిషీ ! నీవు

ఆశాజీవివా ? శ్రమజీవివా ‌? 

నిరాశజీవివా? నిర్ణయించుకో !

 

చేసిన నీ శ్రమ చెడని పదార్థం !

ఇది ముమ్మాటికి పచ్చియదార్థం !

 

ప్రతిభనెవ్వరూ 

...ప్రక్కకు నెట్టలేరు

నిప్పు నెవ్వరూ 

...మూట కట్టలేరు

 

ప్రతిభకు జరుగుతుంది తప్పక 

...పట్టాభిషేకం

కష్టజీవికి జరుగుతుంది తప్పక

...కనకాభిషేకం

 

అందుకే ఓ నిరుద్యోగి ! 

ఉద్యోగం రాలేదు వ్యధ చెందకు...

ఆశేశ్వాసగా సాగిపో ముందుకు...