Facebook Twitter
అసూయ వద్దు… అభినందనే ముద్దు…

కంటిలో కారం కాకు

గుండెలో గునపం కాకు

పగలు ప్రతీకారాలు 

అసూయాద్వేషాలు 

కోపతాపాలు వద్దేవద్దు 

ప్రేమ కరుణ దయ జాలి శాంతి 

సమాధానాలు ముద్దేముద్దు 

విశ్వ విజేతనేనని విర్రవీగవద్దు 

 

ఏనుగంత బలమున్నా 

ఎవరెస్టుశిఖరమంత ఎత్తుకెదిగినా

కరోనా రక్కసి కన్నెర్ర చేస్తే 

విధి ఓ విషపునవ్వు నవ్వితే 

 

పండిన ఎండుటాకులా 

రాలిపోక తప్పదే

కుళ్ళిపోయిన కూరగాయల్లా 

వీధిచివరి చెత్తకుండీలో 

విసిరివేయక తప్పదే

ఎంగిలి విస్తరాకులా 

ఎగిరెగిరిపడి ఏమిలాభం

కుక్కలు వస్తాయి 

చించి ముక్కలుముక్కలు చేస్తాయి 

 

ఎదుటివారు

ఏదైన ఘనవిజయాన్ని

సాధిస్తే‌ చిరునవ్వుతో 

సంతోషంతో

స్పందించేవారంతా

ఆశీర్వదించేవారంతా 

అభినందించేవారంతా

అదృష్టవంతులే ఆరోగ్యవంతులే 

ఆదర్శవంతులే ఆత్మస్వరూపులే

కానీ అసూయాద్వేషాలతో 

రగిలిపోయేవారంతా ఆరిపోయేదీపాలే