Facebook Twitter
దగాకోరులమీద నిఘా...

చుట్టేమి జరుగుతుందో 

పట్టించుకోని వారికి

ముందుచూపులేని వారికి 

 

మంచి మాట చెబితే విననివారికి 

మూర్ఖుల మాటలు వినే వారికీ

 

ముందన్నీ కష్టాలే,భారీనష్టాలే 

చింతలే...చిక్కులే...చీకాకులే...

 

కారణం 

చుట్టూవున్న వారంతా

మేక వన్యపులులని,

 

బాగా నమ్మించి 

నవ్వుతూ, నట్టేటముంచే 

నయవంచకులని, నమ్మకద్రోహులని,

 

కడుపులో కత్తులుంచుకొని 

కౌగలించుకొనే, కసాయివాళ్ళని

తేనెపూసిన కత్తులని, 

 

ఘోరంగా నష్టపోయేంతవరకు

దారుణంగా మోసపోయేంతవరకు

చిట్టచివరి నిముషం వరకు 

తెలుసు కోకపోతే ఎలా?

 

అందుకే, మిత్రులారా!

ఇకనైనా నిజం తెలుసుకోండి

గాఢనిద్ర నుండి మేల్కొనండి

దగాకోరులమీద నిఘా పెట్టండి,లేదా

భవిష్యత్తులో, చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం