Facebook Twitter
చిట్టిచెల్లీ...ఓ నా బంగారుతల్లీ...

చిట్టిచెల్లీ...

ఓ నా బంగారుతల్లీ

కొత్తగా కాలేజీ కెళ్తున్నావ్ 

జరా జాగ్రత్త,.. సుమీ....

పరిచయం పరిచయంగా

స్నేహం స్నేహంగా వున్నంతకాలం,

ఏ ప్రమాదం లేదు,

నెత్తిన ఏ పిడుగూ పడదు,కాని

కనిపించినప్పుడల్లా

దొంగచూపులు చూడడం

 

ముసిముసి నవ్వులు నవ్వడం

నక్కినక్కి తిరగడం

ప్రక్కప్రక్కనే కూర్చోవడం

ఇష్టమైనవి ఇచ్చిపుచ్చుకోవడం

తాకాలని తపన చెందడం

కలవాలని కలవరపడడం

కలవకపోతే కలత చెందడం

సెల్ ఫోన్ లో గంటలతరబడి

పిచ్చి పిచ్చికబుర్లు చెప్పుకోవడం,

నిద్రాహారాలు మాని, 

చాటింగ్ లు చేసుకోవడం

ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ

మురిసిపోతూ,ముద్దులిచ్చుకుంటూ,

గుడ్ నైట్ లు చెప్పుకోవడం 

వాడు ఐ లైక్ యూ అంటే

ఐ లైక్ యూ టూ అనడం

వాడు ఐ లవ్ యూ అంటే

ఐ లవ్ యూ టూ అనడం

వాడు ఐ వాంట్ యూ అని

పార్క్ లకు పార్టీలకు 

రమ్మనగానే పరుగులుపెట్టడం

పిచ్చి ప్రేమలో పడిపోవడమే 

ప్రమాదానికి సంకేతం....

 

నిజానికి,కాలేజీలో నీ చుట్టూర

చాటుమాటుగా కాటువేసే 

"కాలనాగులుంటాయి"

నీకు వలపు వలలు విసిరే

"వేటగాళ్ళు ఉంటారు"

మంచిగా పలకరిస్తూ 

పైకి హీరోలా ఫోజులు గొట్టే

"కేటు గాళ్ళుంటారు"

కమ్మని కబుర్లు చెబుతూ

కామంతో కళ్ళు పొరలు కమ్మిన 

"కసాయి వాళ్ళుంటారు"

 

ఇష్టం లేదు నా వెంట పడకంటే

నీ అంతు చూస్తా నీ గొంతు కోస్తానంటూ

కొబ్బరిబోండాల కత్తులు

చాటూమాటుగా సంచుల్లో

పెట్టుకు తిరిగే "పరమ రాక్షసులుంటారు"

నో అన్నమాట నోటవస్తే యాసిడ్ దాడులకు 

సైతం సిద్దమయ్యే "శాడిస్టులుంటారు"

చెల్లీ..నా చిట్టి తల్లి..జరా జాగ్రత్త,.. సుమీ....