నిజానికి
తల్లిదండ్రుల
ప్రేమ స్వచ్ఛమైనదే
కాని వయసొచ్చిన ఆడపిల్లలు
ప్రేమపిచ్చిపట్టి నచ్చినవాడితో
ప్రేమపక్షులై విచ్చలవిడిగా
వీధుల్లో విహరిస్తున్నారు
గడప దాటుతున్నారు
పరువు గంగలో కలుపుతున్నారు
సరదా సరదాగా అనుకొని
బురదలో కూరుకుపోతున్నారు
తప్పటడుగులు వేస్తున్నారు
తెలిసి తప్పులుచేస్తున్నారు
నిప్పుతో చెలగాటమాడుతున్నారు
జాయ్ ఎంజాయ్ అంటూ
ఊబిలోకి జారిపోతున్నారు
ఊపిరాడక గిలగిలలాడుతున్నారు
"విధిలేక" విలవిలలాడుతున్నారు
కమ్మని కలలుకనే అమ్మానాన్నల కళ్ళను
"కన్నీటిసముద్రాలుగా" మారుస్తున్నారు
"గుండెల్లో గునపాలు" గుచ్చుతున్నారు
ఆకర్షణలోపడి ప్రలోభాలకులోనై
కామంతో కళ్ళు పొరలు కమ్మిన
అమ్మాయిలు ఆవేశంలో తీసుకునే
"తప్పుడు నిర్ణయాలు"
తల్లిదండ్రులను అంతులేని
"మానసికక్షోభకు" గురిచేస్తున్నాయి
అయ్యే ఓ దైవమా ఇది
ప్రేమలో లోపమా?
గతజన్మ శాపమా ?
అమాకురాల్లైన అమ్మాయిలదా?
మత్తుమందు చల్లిన ఆ మోసగాళ్ళదా?
ముందే ముప్పును పసికట్టలేకపోయిన
అంధులైన ఆ అమ్మానాన్నలదా?
అసలు తప్పెవరిదో? ఏమో
వెయ్యి కాగడాలతో వెతికినా అర్థం కాకున్నది
ఇది ఒక అభాగ్యుడైన ఆడపిల్లలతండ్రి ఆక్రందన



