Facebook Twitter
కృషి చేస్తే సమస్తం సాధ్యమే!

అవి అన్నీ గొప్ప ఆలోచనలే

ఎవ్వరూ ఆచరణలో పెట్టనంత వరకే

 

అవి అన్నీ మహా సాహనకార్యాలే

ఎవ్వరూ ప్రయత్నించనంత వరకే

 

అవి అన్నీ గొప్ప గొప్పపనులే

ఎవ్వరూ ప్రారంభించనంత వరకే

 

అవి అన్నీ అందరికీ అసాధ్యాలే

ఎవ్వరూ సాధించినంత వరకే

 

అవి అన్నీ వింతలు విశేషాలే

ఎవ్వరూ కనిపెట్టనంత వరకే

 

అవి అన్నీ మహా అద్భుతాలే

ఎవ్వరూ చేయనంత వరకే

 

అవి అన్నీ మహా ఘనవిజయాలే

ఎవ్వరూ అందుకోనంత వరకే

 

ఒక్కసారి ఎదురులేని ఏకాగ్రతతో

గట్టి నమ్మకంతో గట్టి పట్టుదలతో 

 

సరైన గురు శిక్షణలో దృఢమైన 

దీక్షతో కసితో తపనతో కష్టపడితే

 

నిరంతరం కృషి చేస్తే ఒకే లక్ష్యంతో

విశ్రమించక శ్రమిస్తే సమస్తం సాధ్యమే

 

ఎన్ని రికార్డులనైనా బద్దలు కొట్టవచ్చు

ఎన్ని రివార్డులనైనా అవలీలగా అందుకోవచ్చు

 

పూజలు చేసే వారికి పుణ్యము దక్కినట్లే

ప్రయత్నించే ప్రతివారికి ప్రతిఫలం దక్కుతుంది