ఆక్సిజన్ అందించే అమ్మ? ??
ఒకడు చెట్టంటే
ఆక్సిజన్ అందించే "అమ్మంటాడు"
ఆ అమ్మే నా ప్రాణమంటాడు
ఎంతో ప్రేమతో పెంచుతాడు
ఒకడు ఆ చెట్టును
వానలనుండి వరదలనుండి
చీడపీడల నుండి రక్షిస్తాడు
కంటికి రెప్పలా కాపాడుతాడు
ఒకడు ఎర్రని ఎండకు చెట్టు
నీడలో హాయిగా విశ్రమిస్తాడు
ఒకడు చెట్టును "దేవతంటూ'
భయంతో భక్తితో పూజిస్తాడు
వీరంతా విజ్ఞులే వివేకవంతులే...
ఐతే,ఇద్దరే ఇద్దరు
పుట్టుకతో వృద్దులు
చెట్టుకు బద్దశత్రువులు
ఆవేశపరులు,ఆశబోతులు
అమాయకులు,అజ్ఞానులు
సమాజంలో చీడపురుగులు
వారే,ఒకడు ఊరికి దూరంగా
ఏ చెట్టుకొమ్మకో రెమ్మకో
ఉరేసుకొని అర్ధాంతరంగా
జీవితాన్ని ముగించే "ఓ అజ్ఞాని"
మరొకడు పచ్చని చెట్టును
పదునైన గొడ్డలితో నరికి
విరిగి నేలకొరుగుతున్నవేళ
వికటాట్టహాసం చేస్తూ"విర్రవీగే వెర్రివాడు"



