పుట్టుటయు నిజమాయే
గిట్టుటయు నిజమాయే
నట్టనడుమ మన కర్మ నాటకమాయే
బ్రతుకే ఒక బూటకమాయే
ఏమి సేతుమురా ? లింగా ఏమి సేతుము?
విషపురుగులు కుట్టుట నిజమాయే
విధి కొరడాలతో కొట్టుట నిజమాయే,ఈ
ఘోరవిపత్తు ప్రతిఇంటి తలుపు తట్టుట నిజమాయే
కరోనా రక్కసి ప్రజలను గోతిలో నెట్టుట నిజమాయే
ఏమి సేతుమురా ? లింగా ఏమి సేతుము?
జింక పులికి చిక్కక పరుగులు పెట్టుట నిజమాయే
చిరిగిపోతున్న బట్టను సూదితో కుట్టుట నిజమాయే
గండం గట్టెక్కుటకు గుడిలోగంట కొట్టుట నిజమాయే
ఏమి సేతుమురా ? లింగా ఏమి సేతుము?
మోడువారిన ప్రతిచెట్టు చిగురించుట నిజమాయే
కమ్ముకున్న కారుమబ్బులు కరిగిపోవుట నిజమాయే
చీకటిని చీల్చుకుంటూ రవికిరణం వెలుగుట నిజమాయే
విశ్వమంతా విస్తరించి ప్రజలప్రాణాలను చాటుమాటుగా
కాటువేసే ఈ కరోనా కాలసర్పం కాలగర్భంలో,
కారుచీకటిలో, కలిసిపోవుట,నిజంకాక పోవునా? చెప్పరా
లింగా చెప్పు ఏమి సేతుమురా? లింగా ఏమి సేతుము?
ఏకాంతవాసం చేద్దాము, మందికి దూరంగా వుందాము
మాస్కులు ధరిద్దాము,చేతులు శుభ్రంగా కడుక్కుందాము
మందు వచ్చేంత వరకు,ఈ కరోనా ఖతమయ్యేంత వరకు
ముంచుకొస్తున్న కరోనా ముప్పును తప్పించుకుందాము



