Facebook Twitter
ఏచూపూ చివరిదో ఎవరికి ఎరుక...

ఈ జీవితంలో... 

ఏది చిట్టచివరిదో చెప్పలేము 

మొన్న కళ్లకు కనిపించిన వారు నిన్నలేరు

నిన్న కలిసి మాట్లాడిన వారు నేడులేరు

నేడు కలిసి తిన్నవారు తిరిగినవారు

రేపు తెల్లవారగానే మాయమైపోతున్నారు

కనురెప్పపాటులో కనుమరుగౌతున్నారు

 

అందుకే...

ఏ మాట చివరిదో

ఏ ఆట చివరిదో

ఏ నవ్వు చివరిదో

ఏ పలకరింపు చివరిదో

ఏ కలయిక చివరిదో

ఏ చూపూ చివరిదో ఎవరికి ఎరుక ?

ఇది ఎంతకూ అర్ధంకాని ఓ వింత విషయం

 

అందుకే..

ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి వుండండి

అందరిని మంచిగా పరాకరిస్తూ వుండండి

అందరితో మంచిగా మాట్లాడుతూ వుండండి

ఎవరికీ దూరంగా వుండకండి ఎవరితోనూ పగవద్దండి

రేపటిరోజు మనంపోతూ పట్టుకుపోయేదేముంది చెప్పండి

 

రేపోమాపో...

వెళ్లడమంటూ తప్పదు గనుక 

శత్రుశేషంలేకుండా ఉన్నంతకాలం అందరితో

మంచిగా వుండి మరణించడం ఉత్తమం

 

ఆ తర్వాత మనం...

ఎవ్వరినీ కలవలేనంత దూరం వెళ్తాం 

ఎవరూ పిలిచినా పలకలేనంత దూరం వెళ్తాం 

ఎవరినీ మళ్ళీ తిరిగి చూడలేనంత దూరం వెళ్తాం

అందరం మరలిరాని ఏఅనంతలోకాలకో తరలిపోతాం 

ఇదినిజం ఎవరూ కాదనలేని పచ్చినిజం...నగ్నసత్యం