Facebook Twitter
కోనేటిరాయుడికి కోటిదండాలు !

1.

ప్రతిరోజు ఎందరో తమ చేతిలోఎన్నో డిగ్రీలున్నా ఎన్నోఅర్హతలున్నా విదేశాలకెళ్ళి ఉన్నతచదువులు 

చదివినా ఉద్యోగంరాక, వ్యాపారంచేయలేక, 

నిరుద్యోగులై నిరాశతో రోడ్లమీద తిరుగుతూవుంటే, 

 

నాకు మాత్రం ఏ ఎండతగలకుండ 

ఏసిరూంలో ఖరీదైన కుర్చీలో కూర్చొనే 

గౌరవప్రదమైన ఐదంకెల ఉద్యోగాన్నిచ్చి,కూడా

నిరంతరం నాకు తోడుగా నీడగా కొండంత అండగా వుండే

ఓ కోనేటిరాయుడా మీకు కోటిదండాలు !

 

2.

ప్రతిరోజు ఎందరో ఎన్నిప్రార్ధనలుచేసినా 

ఎన్ని విన్నపాలు పంపినా ప్రతిఫలమందక 

నిత్యం మీ కృపకోసం ఆశతో నిరీక్షిస్తూవుంటే,

  

నాకు మాత్రం నే చేసినా ఒకే ఒక ప్రార్ధనను ఆలకించి అడిగినవి అడగనివి అన్నీనాకు అనుగ్రహించి,కూడా

నిరంతరం నాకు తోడుగా నీడగాకొండంత అండగా వుండే

ఓ కోనేటిరాయుడా మీకు కోటిదండాలు !

 

3.

ప్రతిరోజు ఎందరో  రోడ్డుప్రమాదాలకి గురై

తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటే,

 

అదే రోడ్డుమీద రోజూ ప్రయాణించే 

నన్ను మాత్రం అనేక ఘోర ప్రమాదాలనుండి 

తప్పించి, ప్రతిరోజు సురక్షితంగా ఇంటికి చేర్చి,కూడా 

నిరంతరం నాకు తోడుగా నీడగా కొండంత అండగా వుండే

ఓ కోనేటిరాయుడా మీకు కోటిదండాలు !

 

4.

ప్రతిరోజు ఎందరో ఎన్నో గుళ్లూగోపురాలు తిరిగినా

ఎందరో దేవుళ్ళకు మొక్కినా కోరినకోరికలు తీరక, కొండంత ఆశతో మీ దర్శనంకోసం దీనంగా ఎదురుచూస్తూ ఉంటే,

 

నన్నుమాత్రం గుడిమెట్లుఎక్కి గుడిలోనికి 

అడుగుపెట్టగానే, మీ అమృతహస్తాలతో తాకి 

అద్భుతమైన అనేక దీవెనలను అందించి,కూడా 

నిరంతరం నాకు తోడుగా నీడగా కొండంత అండగా ఉండే

ఓ కోనేటిరాయుడా మీకు కోటిదండాలు !

 

5.

ఎందరో అనారోగ్యంతో ఆసుపత్రిలోచేరి 

అటునుండి అటే కన్నుమూసి కాటికెళ్తుంటే,

 

నన్ను మాత్రం ఆసుపత్రిపడక మీదనుండి లేపి  

స్వస్థతపరచి ఆరోగ్యవంతుణ్ణి చేసి 

సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికిచేర్చి,కూడా

నిరంతరం నాకు తోడుగా నీడగా కొండంత అండగా ఉండే

ఓ కోనేటిరాయుడా మీకు కోటిదండాలు !