నీకు తప్ప..! నీ ఓటుకు తప్ప
అన్నా..! ఓ ఓటరన్నా..!
ఎన్నో కలలతో...
ఎన్నో ఆశలతో...
ఎన్నికల బరిలో...
దిగిన అభ్యర్థుల
జాతకాలు ఎవరికెరుక...?
నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ కత్తికి తప్ప...
నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ కొడవలికి తప్ప...
నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ త్రిశూలానికి తప్ప...
నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ కరవాలానికి తప్ప...
నీకు తప్ప....నీ అరచేతిలోని
కనిపించని...ఆ అణుబాంబుకు తప్ప...
నీకు తప్ప....నీ అరచేతిలోని
కనిపించని...ఆ వజ్రాయుధానికి తప్ప...
నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ రామబాణానికి తప్ప...
నీకు తప్ప...నీ ఆకలికి తప్ప
నీకు తప్ప...నీ ఆవేశానికి తప్ప...
నీకు తప్ప...
నీ అంతరంగానికి తప్ప...
నీకు తప్ప...
నీవు అనుభవిస్తున్న
నీ అణచివేతకు...
నీ బానిసత్వానికి తప్ప...



