Facebook Twitter
ఫ్రీడమ్ ఇస్ నాట్ ఫ్రీ

It is a fun!
One plus one may be three
But, It is a true!
Freedom is not so free
A Great leader should cry or die Otherwise freedom
won't come from the sky.


నాడు...
అడుగడుగునా అహింసనే ప్రబోధించి పిరికివాళ్ళను సైతం పిడుగులుగ మార్చి ఉప్పు సత్యాగ్రహం చేసి ఉద్యమాలురేపి నిరహార దీక్షలు చేసి నిప్పులు కురిపించి త్యాగాలెన్నో చేసి తెల్లదొరల్ని తరిమేసి ప్రతి భారతీయుడికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని ప్రసాదిస్తే...?
....
తుదకు గాంధీజీనేం చేశారు ?
....
తుపాకి గుళ్ళకు బలిచేశారు.

నాడు...
పెరిస్త్రోయికా అంటు పెనుతుఫాను రేపి అగ్రరాజ్యమైన రష్యారూపురేఖల్ని మార్చి కమ్యూనిజం కారుచీకట్లను తొలిగించి ప్రజాస్వామ్యపు ఉషోదయాన్ని ప్రసాదించి ప్రజాస్వామ్యవాదిగా ప్రపంచ మేధావిగా అఖండ కీర్తినార్జించి...
ఉన్నత శిఖరాలధిరోహించే...

....గోర్బచేవ్ నేంచేశారు గోతిలో త్రోశారు
....సంస్కరణల సాక్షిగ ఆయన్ని
....సమాధి చేశారు.

నాడు...
ఆయిల్ బావులపై ఆశపుట్టి కుట్రలెన్నో పన్ని కువైట్ ని ఆక్రమించి "యుద్ధానికి సిద్ధమేనని" సద్దాం ఓ సవాలు విసిరితే ఆగ్రహించిన అమెరికా బాగ్దాద్ పై "బాంబుల కుంభవర్షం” కురిపించి
హెల్ప్ లేని గల్ఫ్్ఫనేలను" గజగజలాడించి సద్దాం
సామ్రాజ్యమైన "రాక్ లాంటి ఇరాక్”ను

...బుష్ ఏం చేశాడు బూడిదగా మార్చాడు
...విర్రవీగే సద్దాంపై విజయం సాధించాడు.

దివ్యమంగళ తేజోమయుడు ధవళవస్త్రదారి...ధైర్యశాలి
నిత్యం నవ్వులురువ్వే నిర్మలమూర్తి
అణగారిన పేదప్రజల ఆశాజ్యోతిగా ఖ్యాతికెక్కి బంగారు కలలు కంటూ బహిరంగ సభల్లో పాల్గొంటుంటే
మాష్టర్ ప్లాన్ వేసి మానవబాంబును పెట్టి

...చిరునవ్వులు చిందించే రాజీవ్ గాంధీని
...శ్రీ పెరుంబుదూరులో ఏంచేశారు ...
...చిత్రవధచేశారు

Thats why
One plus one may be three
But Freedom is not free...
Freedom is not free.