అన్నదాత కన్నుమూస్తే
ఓ రైతన్నలారా..!
ఇకనైనా నిజం
తెలుసుకోండి....!
నిద్రమేల్కోండి...!
ఢిల్లీ పెద్దలతో
పోరుకు సిద్ధమైన
ఓ రైతు వీరుల్లారా..!
ఓ రైతు సోదరుల్లారా..!
వెనుకంజ వేయకండి..!
ఓ రైతన్నలారా..!
మీకు కొడవళ్ళతో
పంట కొయ్యడం తెలుసు..!
మీకు పొలంలో కలుపు
మొక్కల్ని వేరెయ్యడం తెలుసు..!
అందుకే పిడికిలి బిగించండి..!
పిడుగులు కురిపించిండి..!
నిప్పులు కురిపించండి..!
నిరసనలు తెలియజేయండి..!
అన్నదాత
వెన్ను విరిగితే..?
అందరి నోటమట్టేనని...
అన్నదాత కన్నుమూస్తే..?
దేశమంతట కరువు కరాళ
నృత్యమేనని గట్టిగా హెచ్చరించండి..!



