కసిబట్టిన కరోనా విషపురుగు
ఈ మనిషి పరుగునూ ఆపలేదు
మనిషి ఆశలను ఆలోచన్లనూ ఆపలేదు
అందుకే పడడం మనిషికి అలవాటే పడినా
పైకిలేచి పరుగు పెట్టడం ఈ మనిషికి అలవాటే
అందుకే పెద్దలన్నారు చిమ్మచీకటిలో
కూర్చొనే చింతించే కన్న చితికి చేరేకన్న
"చిరుదీపాన్ని" వెలిగించడం మిన్నని
ఔను గతంగతః అనుకోవాలి
అంతా మన మంచికే అనుకోవాలి
ఆలోచిస్తూ వుండరాదు ఆగిపోరాదు
కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి
దృడసంకల్పంతో సత్కర్మలు చేపట్టాలి
ఈ "కరోనా కష్టాలు" కలకాలం వుండవులే
మందు కనుగొంటే కరోనా మాయమౌతుందిలే
కమ్ముకున్న "కారుమబ్బులు" కలకాలం వుండవులే
కారుమేఘాలను చీల్చుకొని సూర్యుడు వెలుగునిస్తాడులే
కొత్త ఆలోచనలతో మనం
"'కొత్త జీవితాన్ని" ప్రారంభిద్దాం
కరోనా నేర్పిన గుణపాఠాలతో
అప్రమత్తంగా, "ఆశతో" బ్రతుకుదాం
ప్రతి రోజు కొంతధనం "పొదుపు" చేద్దాం
ఆ పొదుపును తెలివిగా "మదుపు" చేద్దాం
పిల్లలకై భవిష్యత్తును "బంగారుమయం" చేద్దాం
హాయిగా ఆనందంగా నిశ్చింతగా ప్రశాంతంగా జీవిద్దాం



