మిత్రులు సైతం శతృవులాయె..
కడుపునిండా తిందామంటే
క్షణక్షణం భయమాయె
కంటినిండా నిద్ర పోదామంటే
కలతనిదరాయే ఉలికిపాటాయె
కాలుబయట పెడదామంటే
లేనిపోని అనుమానమాయే
ఎవరినైనా కలుద్దామంటే
గుండెల్లో గుబులాయె
ఒంటరిగా ఇంటిలో వుండాలంటే
ఎదలో ఏదో దిగులాయె
ఇంటిలో వారితో వుండాలన్నా
లోలోపల అంతులేని భయమాయె
ఎంతటి శక్తిమంతుడికైనా
ఎంతటి మేధావికైనా
ఎంతటి ధీరుడికైనా
వీరుడికైనా మగధీరుడికైనా
కంటికి కనిపించక కాటికీడ్చే
కరోనాను ఖతం చేసే మార్గమే
కనిపించదాయె
అనుమానం పెనుభూతమన్న
ఒక్కటే ముమ్మాటికీ నిజమాయె
మన కళ్ళముందున్న ప్రతిమనిషి
కళ్ళకు కనిపించని ఒక మృత్యువాయె
ప్రాణమితృడైనా పరమ శత్రువాయె
కడుపులో కరోనాను దాచుకొని తిరిగే
సూపర్ స్రైడరాయే, సైలెంట్ క్యారియరాయె
మళ్ళీవస్తోందట మాయదారికరోనా! జాగ్రత్త సుమీ!



