ఓ దైవమా..? ఏమీ దినాలు..?
ఒకటి దుర్దినం...
ఒకటి దుఃఖకరం...
ఒక పార్టీ ఘోర పరాజయం...
ఒక అక్షరయోధుని అస్తమయం...
ఓ దైవమా..? ఏమీ దినాలు..!
ఒకటి శుభకరం...
ఒకటి చరిత్రలో సువర్ణాక్షరాలతో
లిఖించిదగిన శుభదినం...
ఒక చంద్రుడు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా...
ఒక నరేంద్రుడు
మూడోసారి ప్రధానమంత్రిగా...
కొందరి కంట...ఆగని కన్నీటి వర్షం...
కొందరి కంట...ఆనందభాష్పాలు...
కొందరి గుండెల్లో...
రగులుతున్న అగ్నిపర్వతాలు...
కొందరి గుండెల్లో...ఉప్పొంగుతున్న
అంతులేని సంతోష సాగరాలు...
ఓ దైవమా..? ఏమీ దినాలు..?
కొన్ని దిగ్భ్రాంతికరమైన...
దుఃఖకరమైన...
విచారకరమైన...
విషాదకరమైన...దినాలు
కొన్ని విస్తుపోయే...
విస్మయపరిచే...
వినోద భరితమైన...
వింతైన...విచిత్రమైన...
విశిష్టకర...చారిత్రాత్మక...దినాలు
40 ఏళ్లుగా
అలుపెరుగక
చేసిన ప్రజాసేవకు...
51 రోజుల జైలు జీవితానికి...
అనుభవించిన మానసిక క్షోభకు...
అందిన ప్రతిఫలమా..?
ఆంధ్రలో చంద్రునికి
అఖండ విజయం..! అధికార పీఠం..!
500 ఏళ్ల అపరిస్కృత
సమస్యను పరిష్కరించి
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించినందుకు ప్రతిఫలమా..?
ముచ్చటగా మూడోసారి
ఢిల్లీలో నరేంద్రునికి పట్టాభిషేకం...
అందుకే అంటారు
ఇలలో జీవుల జనన మరణాలు
ఆటలో గెలుపు ఓటమిలు దైవాధీనాలని...
అతీంద్రియ శక్తులు అందించే
అద్భుతమైన వరాలు...
అనూహ్యమైన ప్రతిఫలాలు...
ఆ నారాయణుని లీలలు...
ఈ నరుల అంచనాలకు అందవని..



