దూరదృష్టితో...
కఠోర సాధనతో...
సృజనాత్మకతతో
చేసే...ప్రకంపనలు
పుట్టించే...ప్రయోగాలే..!
ఎవరూ కలనైనా
ఊహించని దారుల్లో...
ఎవరూ సాహసించని
వినూత్నమైన విశిష్టమైన
అధ్భుతమైన ఆవిష్కరణలే...
జ్ఞాన సూర్యుడు అక్షర యోధుడైన...
రామోజీ రావు అదృశ్య అస్త్రాలు..!
ధర్మబద్ధంగా బ్రతకాలి
ప్రజల పక్షాన నిలవాలంటూ
నమ్మిన సిద్ధాంతాలకు
కట్టుబడిన...నరసింహం...రామోజీ..!
సమాజ హితం కోసం...
నిరంతరం తపించిన...
గొప్ప దార్శనికుడు...రామోజీ..!
ఎందరో ప్రభుత్వ
పాలకులకు తెరవెనుక...
రాజకీయ గురువు...రామోజీ..!
పనియే దైవమని...
పనిలోనే విశ్రాంతియని
పని చేస్తూనే మరణించాలనే
రాజీపడని పనిరాక్షసుడు...రామోజీ..!
ప్రముఖ
సంగీత దర్శకుడు
కీరవాణి పలికినట్టు
పుడితే మనిషిగా
రామోజీ రావు గారిలా పుట్టాలి
పుట్టి అనితరసాధ్యమైన
సాహసోపేతమైన కార్యాలు చేపట్టాలి
ఆపై నిశ్శబ్దంగా నిష్క్రమించాలి
వెలుగులు విరజిమ్ముతూ
నింగిలో "ధృవతారగా" నిలిచిపోవాలి
అందుకే
రామోజీ ఒక రారాజు
తెలుగు తల్లికి ఒక ఆభరణం...
మన తెలుగు జాతికి గర్వకారణం....
అక్షరయోధునికిదే నా అక్షరనీరాజనం...



