Facebook Twitter
అందరూ ముక్తకంఠంతో చెప్పేమాట ఒక్కటే !

అందరు డాక్టర్లు

ముక్తకంఠంతో చెప్పేమాట ఒక్కటే

కొంతకాలం కరోనాతో సహజీవనం తప్పదని

 

అందరు ఆర్థిక నిపుణులు

ముక్తకంఠంతో చెప్పేమాట ఒక్కటే

చీకటి పడకముందే

దీపాలు వెలిగించుకోమని

 

అందరు అనుభవగ్నులు

ముక్తకంఠంతో చెప్పేమాట ఒక్కటే

కరోనా పిచ్చికుక్క వచ్చి కరవకముందే

రక్షణ కవచాలను ధరించమని

 

అందరు మేధావులు

ముక్తకంఠంతో చెప్పేమాట ఒక్కటే

ఈ కరోనా కాలంలోనైనా

ఈ కంప్యూటర్ యుగంలోనైనా

కాస్త కళ్ళు తెరిచి చూడమని

 

అందరు పెద్దలు

ముక్తకంఠంతో చెప్పేమాట ఒక్కటే

ముందుచూపుతో ముందుజాగ్రత్తతో

ఇంటిల్లిపాదీ ఇమ్యూనిటీని పెంచుకోమని

పొంచివున్న కరోనా ముప్పునుండి తప్పించుకోమని