Facebook Twitter
అది విగ్రహం కాదు అంబేద్కర్ విశ్వరూపం..!

హైదరాబాద్ నడిబొడ్డున
ట్యాంక్ బండ్ కు దగ్గరగా
ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణంలో
అంబేద్కర్ తెలంగాణ
సచివాలయం సమీపంలో
అమరవీరుల స్థూపం ఆనుకొని...

దళితబంధు పథక ప్రదాత 
మహామేధావి మానవతావాది
దార్శనికుడు దయామయుడు
బక్కపలచగా కనిపించే
ఉక్కుసంకల్పంగల ఉక్కుమనిషి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
అమృతహస్తాలతో...
విశ్వమే విస్తుపోయేలా...
మతవాదుల మత్తువదిలేలా...
మనువాదుల మతిభ్రమించేలా...
అంబేద్కర్ ఆశయాలే సాక్షిగా...

డాక్టర్ బిఆర్ అంబేద్కర్
132 జయంతి సందర్భంగా
146 కోట్ల ఖర్చుచేసి
7 ఏళ్ళు శ్రమించి నిర్మించిన
దేశంలోనే అతి పెద్దదైన
125 అడుగుల ఎత్తైన
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
భారీ కాంస్య విగ్రహావిష్కరణ నేడే...
ఇది బహుజనులకు కేసీఆర్
ఇచ్చిన బంగారు బహుమతే...
బహుజనులకు నేడు బోనాల పండుగే...

నిజానికి నేడు
అంబేద్కర్ "దళితనేత"కాదు
భారతీయులందరికీ "నేత"
దళిత జాతి "ఆరనిజ్యోతి"
"విశ్వవిజేత"..."విజ్ఞానఖని"...
"రాజ్యాంగ శిల్పి"...
"నవభారత నిర్మాత"...
"భావిభారత స్పూర్తి ప్రదాత"...

వెనకటికి వెర్రివాడొకడు
నమ్మిన మిత్రున్ని నదిలో తోసేస్తే
బంగారుచేపతో వాడు బయటికొచ్చినట్లు...
బలంగా బంతిని నేలకేసి కొడితే...
అది అంతకుమించి వేగంగా పైకిలేచినట్లు...
అంబేద్కర్ ఆశయాలను ఆర్పివేయాలని
కుట్రల్ కుతంత్రాలెన్ని పన్నినా ఫలితమేమి?

నేడు అంబేద్కర్
నింగి కెగిసిన ఒక నిప్పురవ్వ...
ఆకాశాన్ని తాకిన ఒక అగ్నిపర్వతం...
"అది విగ్రహం కాదు"
"అది అంబేద్కర్ విశ్వరూపం"...
జయహో...! జయహో...!
అమరజీవి అంబేద్కర్ జయహో...!
జయహో...! జయహో...!
సి యం కేసీఆర్ జయహో...!