Facebook Twitter
నిర్లక్ష్యం వద్దు ...నియంత్రణే ముద్దు.

నెత్తిన కిరీటమున్న 

కొమ్ములున్న కోరలున్న

సూదిమొనలో వెయ్యో వంతున్న

సృష్టిలో అత్యంత సూక్ష్మ క్రిమియైన

కరోనా రక్కసి ఎక్కడో

చైనాలో వూహాన్ నగరంలో

గబ్బిలాల కడుపున పుట్టి

పులిలా గాండ్రిస్తుంది

ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది

అగ్రరాజ్యాలను అల్లకల్లోలం చేస్తుంది

 

అందుకే, అజాగ్రత్తగా ఉన్నవారిని

గుంపులుగా, బార్లలో , రెస్టారెంట్లలో

షాపింగ్ మాల్స్ లో, పార్కుల్లో, బీచ్ లలో

రోడ్లమీద విచ్చలవిడిగా తిరిగేవారిని

 

అంటువ్యాధి కాదని ఇదీ ఒక స్వైన్ ఫ్లూ, 

చికెన్ గున్యా, ఎబోలా,నిఫా, ఆంత్రాక్స్, సార్స్, 

మార్స్ లాంటి వైరస్సేనని లైట్ గా తీసుకునేవారిని,

ఇదెప్పుడొచ్చే దగ్గూ, జలుబు,జ్వరం,గొంతునొప్పేనని,  

అసలిది ముసలివాళ్ళ జబ్బంటూ,నిర్లక్ష్యం చేసేవారిని

 

క్వారెంటైన్లలో వుండని వారిని

స్వీయ నియంత్రణ పాటించని వారిని

ముఖానికి మాస్కులు ధరించని వారిని

సోపుతో చేతులు శుభ్రం చేసుకోని వారిని

 

సోషియల్ డిస్టెన్స్ పాటించని వారిని

అప్పుడప్పుడు ఆదమరచి చేతులతో 

ముక్కును, నోటిని, కళ్ళను,రుద్దుకునే వారిని

సెల్ఫ్ లాక్ డౌన్ లో లేని వారిని

 

ఇమ్యూనిటీ కొరబడిన వారిని

ముందు జాగ్రత్తలేవీ తీసుకోని వారిని

కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కి కారకులైన వారిని

కరోనా వైరస్ "టార్గెట్" చేస్తుంది "టార్చర్ "పెడుతుంది

అందుకే నిర్లక్ష్యం వద్దువద్దు,నియంత్రణే ముద్దుముద్దు.