కరోనా కథచెబుతా.....
ఊ/కొడతారా...అనగనగా...చైనాలోని
ఊ/హాన్ లో పుట్టిన ఓ కరోనా మహమ్మారి
ఊ/పిరితిత్తుల్లో చొరబడి
ఉ/క్కిరి బిక్కిరి చేస్తుంది
ఊ/పిరాడకుండా చేస్తుంది
ఊ/పిరి తీస్తుంది
ఊ/ర్లకు ఊర్లనే ఊడ్చేస్తుంది?
ఉ/గ్రవాదిలా ఉన్మాదిలా మారిన
ఉ/గ్రరూపం దాల్చిన ఈ కరోనా రక్కసిపైన
ఉ/క్కుపాదం మోపక తప్పదు
ఊ/హాన్ లో పిలకలాపుట్టి, నేడు
ఊ/డలమర్రిలా విశ్వమంతా విస్తరిస్తోంది
ఊ/హించని విధ్వంసాన్ని సృష్టిస్తోంది
ఉ/న్నోడిని,కూటికి లేని కటికపేదను
ఉ/న్నపళంగా కసితో కాటికీడుస్తోంది కరోనా
ఉ/న్ననేమి విధ్వంసకర యుద్దవిమానాలు
ఉ/న్ననేమి మట్టికరిపించే మరఫిరంగులు
ఉ/న్ననేమి అణుబాంబులు అన్నీ వృధా అందుకే
ఉ/రితాళ్ళు సిద్ధం చేయండి ఆ కరోనా రక్కసిని
ఉ/రితీసేద్దాం ఇండియాగేటుకు వ్రేలాడతీసేద్దాం,హోలీ
ఉ/త్సవం చేసుకుందాం కరోనాను ఖతం చేసినందుకు



