మరుగుజ్జులుగా మారకండి?
ఈ ఆశల ఆరాటంలో
ఈ జీవన పోరాటంలో
కులరక్కసి కోరల్లో చిక్కి
అలసి సొలసి పోయిన
ఓ చిరుఉద్యోగులారా!
ఇకనైనా నిరాశ చెందక
నిజం తెలుసుకోండి!
ఈ కంప్యూటర్ యుగంలోనైనా
కళ్ళు తెరుచుకోండి!
"ఎదగడానికి ఎందుకురా తొందర
ఎదర బతుకంతా చిందర వందర"
అన్నాడని ఓ అమాయకపు కవి
అడుగు వెయ్యడానికి ముందుకు
అలా మీరు జంకుతున్నారెందుకు ?
లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్
బట్ బుష్ ఆఫ్ థాన్స్
అన్నాడని ఓ ఆంగ్ల కవి
అడుగు వెయ్యడానికి ముందుకు
అలా మీరు జంకుతున్నారెందుకు?
మీకన్నా చిన్నవారు మీవెంటే ఉన్నవారు
మీకంటే ఎంతోఎత్తుకు ఎదిగిపోతూవుంటే
మీరెందుకు ఎదగలేక పోతున్నారు?
మీరెందుకు మత్తుగా ఉన్నారు ?మారకున్నారు ?
మీరెందుకు "మరుగుజ్జులుగా" మారుతున్నారు ?
ఆలోచించండి అడుగులు ముందుకు వెయ్యండి



