Facebook Twitter
మనసులు దోచిన మహానటి..

ఆహా ! ఔరా !
ఏమి అందము...
ఏమి అభినయము...
చూసేందుకు రెండు కళ్ళుచాలవే...
చూస్తుంటే ఇంకా ఇంకా
చూడాలనిపించే ఆ అందము...
మనసులను దోచిన మకరందము...
తిలకించిన వారు పులకించి పోదురే
ఆ బ్రహ్మ ఈ భూమిపైకి పంపిన
ఆ అప్సరసే ఈ అతిలోక సుందరి...
ఆ రంభా ఊర్వశి మేనకలనే మించిన
ఈ మేలిమి బంగారుబొమ్మ ఎంత సుందరం !
ఎంత మనోహరం ! ఎంత రమణీయం !
అందమైన ఆ చందమామ...
ఏడు రంగుల ఆ ఇంద్రధనుస్సు....
కొలనులో విరబూసిన
ఆ కలువభామ...
పురివిప్పి మైమరచి నాట్యమాడే
ఆ మయూరి...
గుభాళించే ఆ గులాబి...
మురిపించే కొత్త జంటలను
మైమరపించే ముద్దొచ్చే
ఆ ముద్దమందారం... సైతం
సిగ్గుతో తలదించుకొనునేమో
ఆమె అందానికి అసూయ చెందునేమో
అడిగితే ఆ అందాల తాజ్ మహల్ 
కూడా ఔననునేమో
రవివర్మ వేసిన ఆ వర్ణచిత్రంకన్నా...
బాపు గీచిన ఆ బంగరుబొమ్మకన్నా...మిన్న
అన్న నా మధుర భావన అక్షరసత్యమే
అందుకే...
అందానికే అందానివై...
అంతులేని అనురాగమే నీరూపమై...
దాతృత్వమే నీ ఊపిరియై..
ఇలలో మా కలలో ఆ గగనాన
మిళమిళమని మెరిసే తారవై...
మా మదిలో నిలిచిన అందాల దేవతవై...
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఓ సహజనటీ
మీ కిదే  మా అక్షరనీరాజనం....
ఎన్ని జన్మలైనా మేము నిన్ను మరువలేము...
మీరెప్పుడూ మా కనురెప్పల కింద ఒక కమ్మనికలగా
మాగుండెల్లో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా
నిలిచిఉంటారు ఇది శిలాక్షరమే...చెరగని అక్షరసత్యమే.