Facebook Twitter
అపరచాణిక్యుడు‌ పీవీ

కష్టాలను కనురెప్పల మాటున
అవమానాలను అంతరంగాన
ప్రత్యర్థుల విమర్శల గరళాన్ని
కంఠాన దాచుకున్న ఓ బోళాశంకరుడా !

గుండెబలంతో,రాజకీయ చతురతతో
భారత ప్రధానమంత్రి పదవిని అలంకరించిన
ఓ రాజనీతిజ్ఞుడా ! ఓ పి.వి నారసింహుడా !

ఓ స్వాతంత్ర్య సమరయోధుడా !
ఓ వ్యూహరచనా దురంధరుడా !
ఓ కాకలుతీరిన రాజకీయనాయకుడా !
ఓ అపరచాణక్యుడా ! ఆర్థిక సంస్కరణలకు
ఓ పితామహుడా ! ఓ పి.వి. నారసింహుడా !

రాజనీతిజ్ఞతకు నిలువెత్తు నిదర్శనంగా
స్థితప్రజ్ఞతకు చెరగని సంతకంగా, శాంతమూర్తిగా
తెలుగుగడ్డపై పుట్టి ఢిల్లీకిచేరిన‌ ఓ తెలంగాణబిడ్డా !

18 భాషలు నేర్చిన బహుభాషాకోవిదుడా !
వేయిపడగల నవలను హిందీ బాషలోకి 
అనువదించి ఓ సాహితీ సార్వభౌముడా !

జయహో ! జయహో ! ఓ జాతినేత !
ఓ స్పూర్తి ప్రదాత ! ఓ తెలుగు తేజమా !
వందనం ! అభివందనం‌ ! ఓపి.వి.నారసింహుడా !
మీ స్మరణే !
ఈ తెలుగుజాతికి ఒక గొప్ప ప్రేరణ !