Facebook Twitter
ఈస్టర్ శుభాకాంక్షలు

ప్రియమైన నా మిత్రులారా..!
సంతోషకరమైన ఈ ఈస్టర్ పర్వదినాన మేము మనసారా కోరుకునేది ఒక్కటే...
వచ్చే ఈస్టర్ పండుగ వరకు మీరు
ఏ కష్టాలు...
ఏ కలతలు...
ఏ కలహాలు...
ఏ కన్నీళ్లు లేకుండా...

మీ అందమైన ముఖాన...
చెరగని చిరునవ్వులు
మీ మంచి మనసులో
అంతులేని సంతోషం
మీ దయగల హృదయంలో
ఆనందం...పరమానందం
పొదరిల్లులాంటి మీ ఇంటిలో...
సుఖము శాంతి సమాధానము

కోరని కోటి వరాలుగా...
దివ్యమైన దీవెనలుగా...
బంగారు బహుమతులుగా...

ఆ రక్షకుడు...
ఆ ప్రేమామయుడు...
ఆదయామయుడు...
ఆ కరుణామయుడు...
ఆ మృత్యుంజయుడు
ప్రభువైన యేసుక్రీస్తు
మీకు మీ కుటుంబ
సభ్యులందరిపైన
ప్రేమతో కుమ్మరించాలని...
మనసారా కోరుకుంటూ...
ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలతో...

మీ ఆత్మీయ సాహితీ మిత్రుడు
పోలయ్య కవి కూకట్లపల్లి హైదరాబాద్