Facebook Twitter
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం...

క్రూరమృగాలు సైతం కారడవుల్లో

కలిసిమెలిసి ఎంతో 

ప్రశాంతంగాజీవిస్తున్నాయే

ఈ మానవ మృగాలెందుకు

మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నాయి

 

వయసొచ్చిన అమ్మాయిలకు 

మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో  

మోసగిస్తున్నారే కసాయిలై ప్రవర్తిస్తున్నారే

కాలేజీకని కాలుబయట పెట్టగానే 

కన్నెపిల్లలు కంటికి కనపడగానే 

కామంతో కళ్ళుపొరలు కమ్మిన

కామాంధులు పశువాంఛ తీర్చుకుంటున్నారే

 

వావివరుసలు వయస్సు భేదాలుమరచి 

కన్నబిడ్డ లాంటి ఆడపిల్లలను

కన్నతల్లి లాంటి మహిళలను 

వెంటపడి‌ వేధిస్తున్నారే బాధిస్తున్నారే

 

పులులు జింకలను వేటాడినట్లు  

నిస్సహాయులైన మహిళలు కనిపిస్తే

మహిళలపై అత్యాచారాలకు 

అకృత్యాలకు పాల్పడుతున్నారే 

మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారే  

కౄరమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారే 

 

అమ్మా  ఓ సంక్రాంతి లక్ష్మీ రావమ్మా రా!

నీవైనా ఈ మానవమృగాల బుద్ధిని మార్చు

నీవైనా మా విషాద గాధలు కన్నీటి వ్యధలు విను 

నీవైనా ఈ స్త్రీ జాతి వెతలను వేదనలను కడతేర్చు

అందుకే ఓ సంక్రాంతి లక్ష్మీ స్వాగతం నీకు సుస్వాగతం