పేదలపై ప్రేమ తప్ప కన్నుల్లో కరుణ తప్ప
ఆపదలోవున్నవారిని తక్షణమే
ఆదుకోవాలన్న తపన తప్ప
చేతికి వెముకలేని కడుపులో కల్మషంలేని
మల్లెలా తెల్లని మంచులా చల్లని
సముద్రమంత లోతైన ఆకాశమంత విశాలమైన
హృదయం సున్నితమైన మనస్తత్వం మంచితనం
మానవత్వం దాతృత్వగుణమున్న దాత ఎవరు?
ఇంకెవరు కర్నూలు నెల్లూరు జిల్లాల్లో
కరోనారోగుల కోసం తన సొంతఖర్చులతో
ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్న
"కలియుగ దానకర్ణుడు" మన సోనుసూద్ గారే...
"అన్నా"అంటే నేనున్నానని ఒక అన్నలా
ఒక అమ్మలా ప్రేమామృతాన్ని కురిపించేవాడు
ఒక సొంత తండ్రిలా బాధతో తపించేవాడు
ఒక ప్రాణస్నేహితునిలా ఆదుకునేవాడు
ఒక ఆపద్భాందవుడిలా, ఒక సైనికుడిలా
తనవాడు పరాయివాడనే తారతమ్యం లేక
ఎక్కడైనా ఎవరైనా ఆపదలో చిక్కుకున్నారంటే
రెక్కలు కట్టుకుని అక్కడ వాలేదెవరు? ఇంకెవరు
ఇద్దరు ఆడపిల్లలే ఎద్దులుగా పొలం దున్నుకునే
మదనపల్లె రైతుకు రాత్రికిరాత్రే ట్రాక్టర్ ను ఇంటికి
చేర్చిన "కలియుగ దైవం" మన సోనుసూద్ గారే...
లక్షల కోట్ల డబ్బున్న
ధనవంతులందరూ దాతలు కారు
కాని,దయాదాక్షణ్యం గల దాతలందరూ
దైవాలే ధన్యజీవులే పుణ్యమూర్తులే చిరంజీవులే
ముక్కోటి దేవుళ్ళకు మ్రొక్కిఅందరం కోరుకోవాలి
కనిపించే కరుణించే ఈ కలియుగ కర్ణుడు సోనుసూద్
130 కోట్లమంది భారతీయుల ఊపిరి పోసుకుని
హాయిగా చల్లగా నిండుగా నూరేళ్ళు వర్ధిల్లాలని....



