Facebook Twitter
సోమసూద్ లాంటి వారుంటే ఎంత బావుండు?

మంచినీళ్లు అడిగితే

మజ్జిగో పాలో ఇచ్చే శ్రీమతి వుంటే 

ఎంత బావుండు ఎంత బావుండు

 

బజాజ్ బైకడిగితే

మారుతీ కారుకొనిచ్చే నాన్నవుంటే

ఎంత బావుండు ఎంత బావుండు

 

ఫీజు అడగకుండా

ఫ్రీగా వైద్యంచేసే ఫ్యామిలి డాక్టరుంటే

ఎంత బావుండు ఎంత బావుండు

 

డ్రంక్&డ్రైవ్ లో దొరికితే కొట్టకుండా

కేసు పెట్టకుండా వదిలేసే పోలీసులుంటే

ఎంత బావుండు ఎంత బావుండు

 

ఆకలేస్తే ఆకేసి పప్పన్నం 

పెట్టమంటే బిర్యాని పెట్టే మిత్రుడుంటే

ఎంత బావుండు ఎంత బావుండు

 

వడ్డీలేకుండా ఋణాలను

మంజూరుచేసే బ్యాంకు మేనేజర్లుంటే

ఎంత బావుండు ఎంత బావుండు

 

కాడెద్దులిమ్మంటే ఖరీదైన ట్రాక్టర్ నిచ్చే

సోమసూద్ లాంటి ఆపద్భాంధవులుంటే

ఎంత బావుండు ఎంత బావుండు

 

కాని,చూసి రండర్రా అని పంపిస్తే,కాల్చి 

బూడిద పట్టుకొచ్చే సిబ్బంది వుంటేనే

కాస్త ఇబ్బంది,కూసింత కష్టం,కాసింత నష్టం