1757 జనవరి 24
దేశ చరిత్రలో ఒక చీకటి రోజు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
బొబ్బిలి చరిత్ర ఒక రక్తచరిత్ర
బొబ్బిలి విజయనగర రాజ్యాల
మధ్య సంధి రాయబారాలు మృగ్యం
శాంతి సామరస్యాలు శూన్యం
విషనాగులా విషంచిమ్మే విజయరామరాజు
కుట్రలతో కుతంత్రాలతో
కక్షలతో కార్పణ్యాలతో
పగ ప్రతీకారాలతో
రెండు రాజ్యాల మధ్య
జరిగిన బొబ్బిలి యుద్ధం రక్తసిక్తం
విజయరామరాజు మోసపూరిత
ఎత్తుగడలకు ఫ్రెంచి సైన్యాలు
బొబ్బిలి కోటను ఆక్రమించుకున్నవేళ
ఇక ఓటమి తప్పదని
శత్రువుల చేజిక్కితే నరకయాతనని
అంతపురవాసులంతా
నిప్పులాంటి నిర్ణయం తీసుకున్నారు
పిల్లలు స్త్రీలు వృద్ధులు బొబ్బిలి వీరులు
అంతపురంలో అగ్నికీలలకు ఆహుతయ్యారు
మంటల నుండి తప్పించుకున్నవారు
కత్తిపోట్లకు గురయ్యారు
బొబ్బిలి కోటలో నాడు
ఎక్కడ చూసినా రక్తపుముద్దలే
మాడి మసైపోయిన వీరసైనికులే
గుట్టలుగుట్టలుగా శవాలే
ఏరులై పారింది వీరులరక్తమే
ఆ హృదయవిదారకమైన
దృశ్యాలకు చలించిన రాజాం
అధికారి తాండ్రపాపారాయుడు
యుద్ధానికి ఆజ్యం పోసిన
ఆమారణహోమానికి ఆద్యుడు
కుట్రదారుడు వెన్నుపోటు పొడిచిన
విజయరామరాజును
32 ప్రతి పోట్లతో కసితీరా
పొడిచి పొడిచి విజయరామరాజు విజయగర్వంతో
తాండ్రపాపారాయుడు ఫ్రెంచి సేనలకు సింహం స్వప్నమయ్యాడు
ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం
ఇది సువర్ణాక్షరములుతో లిఖింపబడిన చెరగనిరక్త చరిత్ర
తాండ్రపాపారాయుడు సాహస గాథలు సదా స్మరణీయం



