Facebook Twitter
ఆకలితీర్చే అంగడిబొమ్మ

ఆకలి తీర్చుకోవడానికి 

చిరునవ్వులు చిందించే 

అందాలు ఆరబోసే 

చీకట్లో చిందులు వేసే 

ఓ అంగడిబొమ్మా! 

 

అందమైన నీ తనువు 

చక్కని అద్దమే! 

ప్రతిబింబం చూసుకొన 

ప్రతి ఒక్కరు సిద్దమే! 

 

ఓసీ నా కలల ప్రేయసి

నీవే నా ఊహలఊర్వశివి

అంటూ వూరించి దొరల్లా వచ్చి

దొంగల్లా సర్వం దోచుకుంటారు 

 

పగలు రాత్రి ఈగల్లా 

ముసిరి ముద్దాడెే ఈ మగవారు 

నేడు బాహుబంధాలలో బందించి 

రేపు ఆశ ఆకలి రెండు తీరగానే 

బహుదూరం నిన్ను నెట్టేస్తారు 

 

విధివశాత్తు నీకు ఏదైనా 

మొండివ్యాధి వచ్చి నీవు 

మంచాన పడితే నీ చుట్టూ 

తెగతిరిగే ఈ మగవారే రేపు

నీ మీదవాలే ఈగలౌతారు 

 

అందుకే గుర్తుంచుకోవమ్మా 

ఓ అందాల అంగడిబొమ్మా 

నీకు సుఖము శాంతి సౌఖ్యం కల్ల

ఈ మాయదారి మగమృగాల వల్ల

 

ఈ జీవితసత్యం నీకు తెలియనిది కాదు

తస్మాత్ జాగ్రత్త ఓ తరుణీ నీ ముందు

జీవితం పరులకు విందుభోజనం కారాదు