Facebook Twitter
అతి ఆలోచన అతి అనుమానం...

అతిగా ఆలోచించేవారు

ప్రతిదీ భూతద్దంలో చూస్తారు

ప్రతిదీ భూతద్దంలో చూసేవారికే

గండు చీమసైతం గర్జించే సింహంలా

తాడు సైతం త్రాచుపాములా కనిపిస్తుంది

అతిగా ఆలోచించేవారు

అందరిని అన్నిటిని అనుమానిస్తారు

అందరిని అన్నిటిని అనుమానించేవారే

అడుగు ముందుకెయ్యలేరు

అడుగు ముందుకెయ్యలేనివారే

అభివృద్ధి చెందలేరు