పిచ్చుకపై బ్రహ్మాస్త్రం...
తండ్రిని ఓడించిన తర్వాత
తనయున్ని ఓడించడం కష్టంకాదు
నాయకున్ని ఎదిరించిన తర్వాత
కార్యకర్తను బెదిరించడం కష్టంకాదు
పండితుని మోసం చేసిన తర్వాత
పామరున్ని నమ్మించడం కష్టంకాదు
వీరుడి కొమ్ములే విరిచిన తర్వాత
పిరికివాడి భరతం పట్టడం
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే