ముగిశాయి ముగిశాయి
హోరాహోరీగా అభ్యర్థుల
పార్టీల భారీ ప్రచారాలు...
సభలు సమావేశాలు....
ఆవేశపూరిత ప్రసంగాలు...
చెవులు చిల్లులుపడేలా
ఆ కుర్రకారు పాటల హోరు...
ఆ వరుస వాహనాల జోరు...
ముగిశాయి ముగిశాయి
మూడు పార్టీల ముచ్చట్లు...
వీధుల్లో జండాల జగడాలు...
నిప్పురవ్వలా తారాజువ్వలా
నిరుద్యోగుల ప్రతినిధిగా...
ప్రత్యర్థులకు ప్రక్కలో బల్లెంలా...
సోషియల్ మీడియాలో విశ్వమే
విస్తుపోయేలా బర్రెలక్క విశ్వరూపం...
నేటి వరకు నేతల మాయాజాలం...
రేపటి నుండి ఓటరన్న మాయాజాలం...
ఔను ఏ అభ్యర్థిని...
ఎవరెస్టు శిఖరం ఎక్కిస్తాడో...
ఎవరిని అధఃపాతాళానికి విసిరేస్తాడో... ఎవరికెరుక ?ఆ బ్యాలెట్ బాక్సులకు తప్ప...
రామరాజ్యమా...?
రాక్షస రాజ్యమా..?
స్వర్గమా...? నరకమా..?
ఔను ఈ ఓటరన్న ఏమి సృష్టించునో
ఎవరికెరుక ?ఆ బ్యాలెట్ బాక్సులకు తప్ప...
నిజమే ఈ ఎన్నికల రణక్షేత్రంలో
కొందరికి శిక్ష...కొందరికి శ్రీరామరక్ష...
అభ్యర్థులందరికీ ఇదొక అగ్నిపరీక్ష...



