Facebook Twitter
మూడు ముఖద్వారాల ముచ్చట..?

అదిగో నేడు...
(28.05.2023)న ఢిల్లీలో
ప్రధానమంత్రి మోడీచే
ప్రారంభించ బడుతున్న
అందమైన 
అపురూపమైన
అద్వితీయమైన
సుందరమైన...సువిశాలమైన 
త్రిభుజాకారంలో‌ నిర్మించబడిన
నాలుగు అంతస్తుల
నూతన‌ పార్లమెంట్ భవనం...
జ్ఞాన...శక్తి...కర్మ...అను
మురిపించే మూడు ముఖద్వారాలతో
కళకళలాడుతోంది...కనివిందుచేస్తోంది

జ్ఞాన ద్వారానికి...
ఒకవైపు గార్గి యజ్ఞవల్య
సంవాద దృశ్యం...
మరోవైపు నలంద చిత్రాలు

శక్తి ద్వారానికి....
ఒకవైపు చాణిక్య చిత్రం
మరోవైపు మహాత్మా గాంధీ
దండియాత్ర దృశ్యాలు

కర్మ ద్వారానికి...
ఒకవైపు కోణార్క్ చక్రం
మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ల కాంస్యవిగ్రహాలు