బంగారుగుడ్లు పెట్టే బాతులు..?
ఎన్నికల వేళ
అరచేతిలో స్వర్గం
చూపే మన నాయకులు
నిద్రలో లేపినా చెబుతారు
తీయంగ...." నీతులు"
భద్రంగ వెనుక తీస్తారు
లోతుగ......"గోతులు"
పేదల కొంపలు
కాల్చి కూల్చే ఈ
కొండమీది..."కోతులు"
కాదురా బాబు
రేపు బంగారు గుడ్లు
పెట్టే.........."బాతులు"