అదే ముఖ్యం...
ఎన్నిసార్లు పోటీలో
పాల్గొన్నామన్నదికాదు
ముఖ్యం
కప్పు గెలిచామా లేదా
అన్నదే ముఖ్యం
ఎన్ని సార్లు పరీక్షలు
వ్రాశామన్నది కాదు
ముఖ్యం
ఫస్ట్ ర్యాంక్ కొట్టామా లేదా
అన్నదే ముఖ్యం
ఎన్ని ఇంటర్వ్యూలకు
అటెండ్ అయ్యామన్నదికాదు
ముఖ్యం
ఉద్యోగంలో చేరామా లేదా
అన్నదే ముఖ్యం