Facebook Twitter
జై పాతాళభైరవి !

జై పాతాళభైరవి! 

బాలకా !ఏమిరా నీ కోరిక ?

తల్లినేను అప్పుల్లో "మోకాళ్ళలోతు" కూరుకుపోయా

భయపడకురా ఢింభకా !బయటపడవచ్చునురా!

 

జై పాతాళభైరవి !

బాలకా! ఏమిరా నీ కోరిక ?

తల్లి నేను త్రాగుడుకు బానిసనై

"నడుముల్లోతు"వరకు మునిగిఉన్నా

భయపడకురా ఢింభకా !బయటపడవచ్చునురా! 

 

జై పాతాళభైరవి !

బాలకా! ఏమిరా నీ కోరిక ?

తల్లి నేను డ్రగ్స్ కు బానిసనై 

"భుజాలవరకు" మునిగిపోయిఉన్నా

భయపడకురా ఢింభకా! బయటపడవచ్చునురా!

 

జై పాతాళభైరవి! 

బాలకా !ఏమిరా నీ కోరిక ?

తల్లి నేను ప్రేమపిచ్చిపట్టి 

"పీకలల్లోతుకు" మునిగి ఊపిరాడకున్నాను

భయపడకురా ఢింభకా! బయటపడవచ్చునురా!

 

జై పాతాళభైరవి !

బాలకా !ఏమిరా నీ కోరిక ?

తల్లి నేను నెట్టులో "నడిజుట్ఠు" వరకు కూరుకుపోయా

భయపడకురా ఢింభకా!బయటపడవచ్చునురా!

 

జై పాతాళభైరవి !

బాలకా !ఏమిరా నీ కోరిక ?

తల్లి నేను నిద్రాహారాలు మాని

వాట్సాప్  ఫేస్ బుక్కుల్లో 

ఎరక్కపోయి ఇరుక్కుపోయి 

లైకులంటూ కామెంట్లంటూ కలవరిస్తున్నా

ఔను బాలకా బానిసైతే సెల్లుకు

బ్రతుకు భారమే! ఘోరమే! దుర్భరమే! దుఃఖమే!

 

"వాట్సాప్ 

ఫేస్ బుక్ ఒక ఊబి" 

అందులోకి జారిపోతే

జాతకాలే మారిపోతాయ్!

తలరాతలే తారుమారౌతాయ్!

అంటే...

మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్టు!

మీ కంటిని మీరే పొడుచుకున్నట్టు!

మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకున్నట్టు!

మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కున్నట్ఠు!

అందుకే మిత్రులారా! జాగ్రత్త ...తస్మాత్ జాగ్రత్త!

మీ సెల్లు జాగ్రత్త! మీ కళ్ళు జాగ్రత్త! మీ ఒళ్ళు జాగ్రత్త!