Facebook Twitter
నిరసనకారులపైకి నీళ్ళ ట్యాంకర్

ఇది చూడలేక పోతున్నా...
ఏమీ రాయలేక పోతున్నా...
ఇది నిజమనినమ్మలేకపోతున్నా...
ఇదెక్కడి ధర్మం...
ఇదెంతటి ఘోరం...
ఇదెక్కడి న్యాయం...
ఇదెంతటి దారుణం...
ఇదెంతటి కౄరత్వం...
ఇదెంతటి అమానషత్వం...
ఉద్యమాలు చేయడం...
హక్కులకోసం పోరాడడం...
ప్రశాంతంగా నిరసనలు చేయడం...
ప్రజల హక్కుకాదా...?
నిస్సహాయులైన నిరాయుధీయులైన
శాంతికాముకులైన మాతృమూర్తులైన
మహిళలను నీళ్ళ ట్యాంకర్ తో తొక్కించిన
ఈ రాక్షసుడికి ఏశిక్ష వేయాలి ?
నడిరోడ్డుపై ఉరితీయాలి లేదా
కరుణా జాలి దయలేని ఆకఠినాత్మడిపైకి
అదే ట్యాంకర్ ను ఎక్కించాలి
ఎక్కి తొక్కించాలి రక్తం కక్కించాలి
అదే ఆ దుర్మార్గుడికి సరైన శిక్ష...
వాడు మానవత్వం లేని మృగం...
వాడు రాతి గుండెగల రాక్షసుడు..
వాడు రక్తంరుచి చూసిన రాబందువు...
వాడు కడుపు నింపే తల్లులు
పాలిట కాలయముడు...
వాడు అంధుడు.
వాడు అహంకారి...
వాడు కఠినాత్ముడు.....
వాడు కర్కోటకుడు...
వాడు కుటుంబాలను కూల్చిన కుక్క...
వాడు పాలకులు మెప్పుకోసం
అమానుషంగా ప్రవర్తించిన మూర్ఖుడు
ముష్టివాడు పాపిష్టివాడు...
ఇకనైనా ప్రభుత్వం కళ్ళు
తెరవకున్న ముంచుకొచ్చేది...
ముందున్నది...పెనుప్రమాదమే..
నిగ్రహం కోల్పోయిన రైతులు
ఉగ్రులై ఆగ్రహిస్తే... ఉగ్రరూపం దాలిస్తే
పారేది... రక్తపుటేరులే...
పాతాళంలోకి జారేది... ప్రభువుల పీఠాలే ...
గుడ్డివాళ్ళు నేర్చుకోక తప్పదు గుణపాఠాలే...

(ఘజీపూర్ లో‌ రైతుమహిళలపైకి నీళ్ళ ట్యాంకర్ ను
ఎక్కించి తొక్కించిన అమానుష చర్యను ఖండిస్తూ)...