Facebook Twitter
ఆడదంటే అంత అలుసా?

అలుసా అలుసా?
ఆడదంటే అంత అలుసా?
చూస్తా చూస్తా ! సహనం నశిస్తే
కోస్తా కోస్తా ! కొడవలితో మీ పీకలు కోస్తా!
వేస్తా వేస్తా ! గండ్రగొడ్డలితో వేటు వేస్తా! 
తీస్తా తీస్తా ! మీకు గొయ్యి తీస్తా!
చేస్తా చేస్తా !
మిమ్మల్ని సామూహికంగా సమాధి చేస్తా !
పెడతా పెడతా !
మీ అందరి చితికి నిప్పు పెడతా !

అలుసా అలుసా?
ఆడదంటే అంత అలుసా ?
తెలుసా తెలుసా ? నేనెవరో తెలుసా?
నేను మీ ముందర
నృత్యం చేసే మృత్యువును
వస్తా వస్తా ! కాళినై !
కలకత్తా కాళినై భద్రకాళినై మహంకాళినై వస్తా !
చేస్తా చేస్తా !
కామదాహం" తీర్చుకున్న మీ అందరి గుండెలపై విలయతాండవం చేస్తా!
తీర్చుకుంటా తీర్చుకుంటా !
మీ రక్తం త్రాగి నా "రక్తదాహం" తీర్చుకుంటా !

అలుసా అలుసా ?
ఆడదంటే అంత అలుసా?
తెలుసా తెలుసా ? నేనెవరో తెలుసా?
నేను మీ నెత్తినపడే పిడుగును
మీ గుండెల్లో ప్రేలే మరఫిరంగిని
వస్తా వస్తా ! నేను త్వరలో వస్తా !

కళ్ళు పొరలు కమ్మిన
ఓ కామాంధులారా !
పడతా పడతా !
మీ అందరి భారతం పడతా !
పుడతా పుడతా !
పూలన్ దేవినై త్వరలో పుడతా !