Facebook Twitter
అమరజీవి... సుభాష్ చంద్రబోస్ కు అక్షర నీరాజనం...

సుభాష్ చంద్రబోస్ అజ్ఞాతంగా
తెల్లదొరలకు వ్యతిరేకంగా విదేశాలనుండి
పోరాడిన గొప్ప"స్వాతంత్ర సమరయోధుడు"
తెల్లదొరల గుండెల్లో నిదురించిన "విప్లవసింహం"
విదేశాలలో ఉంటూ బ్రిటిష్ పాలకులను
ఎదిరించినవాడు వారి గుండెల్లో
నిదురించినవాడు నిద్రలేకుండా చేసినవాడు

భారత మాత స్వేచ్ఛ కోసం
దాస్యశృంఖలాలను త్రెంచడం కోసం
విదేశీ శక్తులను ఏకం చేసిన "వీరాధివీరుడు"

అహింసను ప్రబోధించే గాంధీని విబేధించి
ఆంగ్లేయులపై దండయాత్ర చేయవచ్చన్న
వారిని తరిమి కొట్టవచ్చన్న "సైన్యాధ్యక్షుడు"
కాంగ్రెస్ వారెవరూ కలిసి రాకున్నా
అడగడుగునా అడ్డుతగిలినా
కుట్రలు కుతంత్రాలెన్ని పన్నినా
ఒంటరిగా పోరుసల్పిన "ఒక యుద్ధనౌక"

ఆ మహాయోధుని దుర్మరణం దురదృష్టకరం
అది "హిస్టరీలో" అంతుచిక్కని "ఒక మిస్టరీ"
చనిపోలేదని ఒక బాబాగా అజ్ఞాతవాసంలో
భారతదేశంలోనే చాలా కాలం బ్రతికే ఉన్నారన్నది
ఒక "చిక్కువీడని చిదంబర రహస్యం"

మూడు కమిషన్లు వేసినా
ముఖర్జీ కమిషన్ నిజాలను నిగ్గుతేల్చిన
అన్ని ఆధారాలను ట్రంకు పెట్టెల్లోనే
సమాధిచేసిన నాటి నాయకులు వారి మరణాన్ని
"రాజకీయ కాలనాళికల్లో" అతిరహస్యంగా
భద్రపరిచినా వారు ప్రతిభారతీయుని గుండెల్లో
ఒక "దైవమై"పూజలందుకుంటూనే వుంటారు
ఆరని ఒక "అఖండజ్యోతియై" వెలుగుతూనే వుంటారు

మహానేతలెందరో మరణించినా మట్టిలో కలిసినా
"మరణంలేని మహాయోధుడు... త్యాగధనుడు"
"అందరికీ ఆదర్శప్రాయుడు... అమరజీవి" మన
సుభాష్ చంద్రబోస్...ఓ మహాత్మా ...అందుకో
వెలకట్టలేని మీ త్యాగానికిదే మా అక్షర నీరాజనం...
జోహార్... జోహార్...  ఓ మహానేతా...
జోహార్... జోహార్...  ఓ స్పూర్తిప్రదాత...
జైహింద్....జై భారత్...జై జవాన్...